జైశ్రీరామ్.
తాడినీడవృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
తాడినీడవృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.న.ర.య.జ.ర. లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
పనికిరాని వారె గొప్ప!పదవులందు చుండగా!పాడునందు దేశసౌరులున్!
ధనముకున్న!విల్వయింతె?తదితరాలు గాంతురే!దౌడులేయు!నీతినీమముల్!
మనుజునీతి మట్టిగర్చె!మదిని స్వార్ధ చింతయే!మాడిపోవు!జీవసౌఖ్యముల్!
తనదు మేలె? నీతినిల్చె! తదవతార మందెలే! తాడినీడ బొల్చు! నెంచగా?
1.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం. 343.ప్రాసగలదు.
పనికిరానివారె!గొప్ప!
ధనముకున్న!విల్వయింతె!
మనుజు!నీతి !మట్టిగర్చె!
తనదు!మేలె!నీతినిల్చె?
2.గర్భగత"-అనఘా"-వృత్తము.
అనుష్టప్ఛందము.న.ర.లగ.గణములు.వృ .సం.88.ప్రాసగలదు.
పదవులందు చుండగా!
తదితరాలు గాంతురే?
మదిని స్వార్ధచింతయే!
తదవతార మందెలే!
3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం. 171.ప్రాసగలదు.
పాడునందు!దేశ సౌరులున్!
దౌడులేయు!నీతి నీమముల్!
మాడిపోవు!జీవసౌఖ్యముల్!
తాడినీడ!బొల్చు!నెంచగా!
4.గర్భగత"-నశోచయ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.న.ర.లగ. గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పనికిరానివారె!గొప్ప పదవులందుచుండగా!
ధనముకున్న!విల్వయింతె?తదితరాల! గాంతురే!
మనుజు నీతి!మట్టిగర్చె!మదిని స్వార్ధచింతయే?
తనదు మేలె!నీతినిల్చె!తదవతార!మందె! లే!
5.గర్భగత"-అమూల్య"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.న.ర.జ.గణములు. యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పాడునందు!దేశసౌరులుం!పనికిరాని వారె గొప్ప!
దౌడులేయు!నీతినీమముల్!ధనముకున్ న!విల్వయింతె?
మాడిపోవు!జీవసౌఖ్యముల్!మనుజునీ తి!మట్టిగర్చె!
తాడినీడ బొల్చు నెంచగా!కన! మదంబు!మేటిదాయె!
6.గర్భగత"-సౌరుహీన"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.ర.జ.న.ర. లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
పాడునందు!దేశసౌరులుం!పనికిరాని వారె! గొప్పపదవులందు చుండగా! దౌడులేయు!నీతినీమముల్!ధనముకున్ నవిల్వయింతె?తదితరాల!గాంతురే!
మాడిపోవు!జీవసౌఖ్యముల్!మనుజునీ తి!మట్టిగర్చె!మదినిస్వార్ధమిం తెలే?
తాడినీడ!బొల్చునెంచగా!తనదుమేలె? నీతినిల్చె! తదవతారమందె! లే?
7.గర్భగత"-స్వభావ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.స.జ.గల. గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పదవులందు చుండగా! పనికిరానివారె?గొప్ప!
తదితారాల గాంతురే!ధనముకున్న విల్వయింతె?
మదిని!స్వార్ధచింతయే!మనుజునీతి! మట్టిగర్చె!
తదవతార!మందెలే!తనదు మేలె? నీతినిల్చె!
8.గర్భగత"-మనుజనీతి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.స.జ.ర.జ.ర. లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
పదవులందు చుండగా!పనికిరానివారెగొప్ప!పాడు నందు!దేశసౌరులున్!
తదితరాలగాంతురే?ధనముకున్నవిల్ వయింతె?దౌడులేయు!నీతినీమముల్!
మదిని స్వార్ధచింతయే!మనుజునీతి మట్టిగర్చె!మాడిపోవు!జీవసౌఖ్యము ల్!
తదవతార మందెలే!తనదుమేలె!నీతి నిల్చె!తాడి నీడ బొల్చు నెంచగా!
9.గర్భగత"-రేపటూహ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.య.జ.ర.లగ. గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పదవులందు చుండగా!పాడునందు దేశ సౌరులున్!
తదితరాల గాంతురే?దౌడులేయు!నీతినీమముల్!
మదిని స్వార్ధచింతయే! మాడిపోవు!జీవసౌఖ్యముల్!
తదవతార మందెలే! తాడినీడ!బొల్చు నెంచగా!
10.గర్భగత"-తావళ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.య.జ.ర.జ.సజ. గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
పదవులందుచుండగా!పాడునందుదేశసౌరు లున్!పనికిరానివారె!గొప్ప!
తదితరాలగాంతురే?దౌడులేయు!నీతినీ మముల్!ధనముకున్నవిల్వయింతె?
మదిని స్వార్ధచింతయే?మాడిపోవుజీవసౌఖ్ ఖ్యముల్మనుజునీతిమట్టిగర్చె!
తదవతార మందెలే? తాడినీడ! బొల్చు !నెంచగా! తనదుమేలె?నీతినిల్చె?
స్వస్తి
మూర్తి. జుత్తాడ.
జైహింద్.
1 comments:
నమస్కారములు
" పనికి రానివారె గొప్ప పదవు లందుచుండగా "
అన్నిపద్యములు అలరించు చున్నవి పండితులవారికి ప్రణామములు . శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.