గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, మార్చి 2018, శుక్రవారం

కాపుర,సరళీకృత,బాపురే! గర్భసత్యంనిత్యంవృత్తము. రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్.
కాపుర,సరళీకృత,బాపురే! గర్భసత్యంనిత్యంవృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.

సత్యంనిత్యంవృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.మ.భ.స.న.య.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
కాపరి కల్లల వాడౌచో! కాపురమెటు?సాగును!కడదనుక!యోచింపంగన్!
శ్రీపరివేష్టిత!చిత్తానన్!రేపటి దినమెంచక!చెడుతలచి!నర్తింపంగన్!
తాపమె!నిల్చు!నశాంతంబున్!దాపగు!నరకానికి!తడబడును!చింతల్గ్రమ్మన్!
పాపము!పాపమె?యేమైనం!బాపురె?చెడువీడవె?వడివెదుకు!సత్యంనిత్యం!

1.గర్భగత"'-విభ్రమాన"-వృత్తము.
బృహతీఛందము.భ.భ.మ.గణములు.వృ.సం.55.ప్రాసగలదు.


కాపరి!కల్లలవాడౌచో!
శ్రీపరివేష్టిత!నశాంతంబున్
 తాపమె!నిల్చు!నశాంంబున్!
పాపము!పాపమె?యేమైనన్!

2.గర్భగత"-ఊహామానస"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.స.లల.గణములు.వృ.సం.223.ప్రాసగలదు.
కాపుర మెటు?సాగును!
రేపపటి!దిన మెంచక!
దాపగు !నరకానికి!
బాపురె!చెడువీడవవె?

3.గర్భగత"-భక్తిమార్గ"-వృత్తము.
బృహతీఛందము.న.స.మ.గణములు.వృ.సం.32.ప్రాసగలదు.
కడదనుక!యోచింపంగన
చెడుదలచి!నర్తింపంగన్!
తడబడును!చింతల్గ్రమ్మన్!
వడి వెదుకు!సత్యం నిత్యం!

4.గర్భగత"-శ్రీచింతనా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.మ.భ.స.లల.గణములు.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కాపరి!కల్లలవాడౌచో!కాపురమెటు?సాగును!
శ్రీపరివేష్టిత చిత్తానం!రేపటి దినమెంచక!
తాపమె!నిల్చు! నశాంతంబున్!దాపగు!నరకానికి!
పాపము పాపమె!యేమైనం?బాపురె?చెడువీడవె?

5.గర్భగత"-ఆగమన"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.స.న.న.య.గగ.గణములు.యతి.9.వ.యషరము.
ప్రాసనీమముగలదు.
కాపురమెటు?సాగును!కడదనుక!యోచింపంగన్!
రేపటి దినమెంచక!చెడు తలచి నర్తింపంగన్!
దాపగు!నరకానికి!తడబడును!చింతల్గ్రమ్మన్!
బాపురె!చెడు వీడవె! వడి వెదుకు!సత్యం నిత్యం!

6.గర్భగత"-ఆశాంత"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.న.న.య.మ.స.స.గగ.గణములు.యతులు.9.18.
ప్రాసనీమముగలదు.
కాపురమెటు!సాగును?కడదనుక!యోచింపంగం!కాపరి!కల్లలవాడగుచో!
రేపటి దినమెంచక!చెడుతలచి!నర్తింపంగం!శ్రీపరివేష్టిత!చిత్తానన్!
దాపగు!నరకానికి!తడబడును!చింతల్గ్రమ్మం!తాపమె!నిల్చు!నశాంతంబున్!
బాపురె!చెడువీడవె?వడి వెదుకు?సత్యంనిత్యం!పాపము!పాపమె!యేమైనన్

7.గర్భగత"-నసమా"-వృత్తము.
ధృతిఛందమున.స.మ.భ.భ.మ.గణములు.యతి.10.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
కడదనుక!యోచింపంగం!కాపరి కల్లల వాడౌచో?
చెడుదలచి!నర్తింపంగం!శ్రీపరివేష్టిత!చిత్తానన్!
తడబడును!చింతల్గ్రమ్మం!తాపమె!నిల్చు నశాంతంబున్!
వడి!వెదుకు!సత్యంనిత్యం!పాపము!పాపమె?యేమైనన్?

8.గర్భగత"-కాపుర"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.స.మ.భ.భ.మ.భ.స.లల.గణములు.యతులు.10.19.
ప్రాసనీమముగలదు.
కడదనుక!యోచింపంగం!కాపరి కల్లల వాడౌచో?కాపురమెటు?సాగును!
చెడుదలచి!నర్తింపంగం!శ్రీపరివేష్టిత!చిత్తానం!రేపును!దలపోయక!
తడబడును!చింతల్గ్రమ్మం!తాపమె!నిల్చు!నశాంతంబుం!దాపగు!నరకానికి
వడివెదుకు!సత్యంనిత్యం!పాపము!పాపమె?యేమైనంబాపురె!చెడువీడవె?

9.గర్భగత"-సరళీకృత"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.స.స.స.స.గగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కాపురమెటు?సాగును!కాపరి!కల్లల వాడౌచో!
రేపునుదలపోయక!శ్రీపరివేష్టిత!చిత్తానన్!
దాపగు!నరకానికి!తాపమె!నిల్చు!నశాంతంబున్!
బాపురె?చెడువీడవె?పాపము!పాపమె?యేమైనన్!

10.గర్భగత"-బాపురె!వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.స.స.స.త.న.య.లగ.గణములు.యతులు.9.18.
ప్రాసనీమముగలదు.
కాపురమెటు?సాగును!కాపరి!కల్లలవాడౌచో!కడదనుక!యోచింపంగన్!
రేపునుదలపోయక!శ్రీపరివేష్టిత!చిత్తానం!చెడుదలచి!నర్తింపంగన్!
దాపగు!నరకానికి!తాపమె!నిల్చు!నశాంతంబుం!తడబడును!చింతల్గ్రమ్మన్
బాపురె?చెడువీడవె?పాపము!పాపమె?యేమైనం!వడివెదుకు!సత్యంనిత్యం!
 స్వస్తి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కాపరి కల్లల వాడౌచో ! కాపుర మెటు సాగును ? [మంచి భావము ]
పలురకముల చందస్సులలో మాకందించిన శ్రీ వల్లభవఝులవారి ప్రతిభ శ్లాఘనీయము . శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.