గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, మార్చి 2018, శనివారం

అనేక వృత్త గర్భితసద్విశాలవృత్తము. రచన:-వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
సద్విశాలవృత్తము. రచన:-వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి.
  జుత్తాడ.

సద్విశాలవృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.ర.జ.ర.జ.గల.గణములు.యతులు.10.19.
.ప్రాసనీమముగలదు.
వారికర్మ!వారు మానుచుం!పరులకర్మ!నెత్తిజూపి!పాడుటూహ!వీడరేల?
పోరుగోరి!కాలు దువ్వుచుం!పురిటి వేదనంబదేల?బోడిచింత!మానరేల?
తారుగొప్ప!తాముజాటుచుం!తరియజూడమోక్షమౌనె!దాడినెంచుమార్గమేల?
పౌరుషంబు!జూపి!దోషులై!పరిధిదాటి సంచరింప!పాడియౌనె?జీవితాన!

1.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు!
వారి కర్మ వారుమానుచున్!
పోరుకోరికాలుదువ్వుచున్!
తారుగొప్ప!తాము!చాటుచుం!
పౌరుషంబు!చూపి!దోషులై!

2.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.ప్రాసగలదు.
పరుల కర్మ నెత్తిజూపి!.
పురిటి వేదనంబదేల?
తరియ జూడ!మోక్షమౌనె?
పరిధి దాటి సంచరింప?

3.గర్భగత"సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
పాడుటూహ!వీడరేల?
బోడిచింత!మానరేల?
దాడినెంచు!మార్గమేల?
పాడియౌనె?జీవితాన!

4.గర్భగత"-సునీతినీ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.న.జ.ర.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
వారికర్మ!వారుమానుచుం!పరులకర్మ!నెత్తిజూపి!
పోరుగోరి!కాలుదువ్వుచుం!పురిటి!వేదనంబదేల?
తారుగొప్ప!తాముజాటుచుం!తరియజూడ!మోక్షమౌనె?
పౌరుషంబుజూపి!దోషులై!పరిధి దాటిసంచరింప!

5.గర్భగత"-భావినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.ర.జ.గల.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పరులకర్మ!నెత్తిజూపి!పాడుటూహ!వీడరేల?
పురిటి!వేదనంబదేల?బోడిచింత!మానరేల?
తరియ!జూడ మోక్షమౌనె?దాడినెంచు!మార్గమేల?
పరిధి!వీడి!సంచరింప!పాడియౌనె?జీవితాన!

6.గర్భగత"-కీర్తిగామినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.రజ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10.18.
ప్రాసనీమముగలదు.
పరులకర్మ నెత్తిజూపి!పాడుటూహవీడరేల?వారికర్మ!వారుమానుచున్!
పురిటి!వేదనంబదేల?బోడిచింత!మానరేల?పోరుకోరి!కాలుదువ్వుచున్!
తరియజూడమోక్షమౌనె?దాడినెంచుమార్గమేల?తారుగొప్పతాము!
జాటుచున్?
పరిధిదాటి సంచరింప!పాడియౌనె?జీవితాన!పౌరుషంబు జూపిదోషులై!

7.గర్భగత"-యతిర్నవసుగంధి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములుయతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పాడుటూహ!వీడరేల?వారికర్మ వారు మానుచున్!
బోడిచింత!మానరేల?పోరుకోరి కాలుదువ్వుచున్!
దాడినెంచు!మార్గమేల?తారుగొప్ప తాము జాటుచున్!
పాడియౌనె?జీవితాన!పౌరుషంబు!జూపి!  దోషులై!

8.గర్భగత"-నియమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.జ.స.జ.గల.గణములు.యతులు.9.18.
ప్రాసనీమముగలదు.
పాడుటూహ వీడరేల?వారికర్మ వారు!మానుచుం!పరులకర్మ!నెత్తిజూపి!
బోడిచింత మానరేల?పోరుకోరి కాలుదువ్వుచుం!పురిటివేదనంబదేల?
దాడినెంచు మార్గమేల?తారుగొప్ప!తాముజాటుచుం!తరియజూడ!
మోక్షమౌనె?
పాడియౌనె?జీవితాన!పౌరుషంబుచూపి!దోషులై!పరిధిదాటి!సంచరింప!

9.గర్భగత"-నీతిగా"-వృత్తము.
ధృతిఛందము.న.ర.జ.ర.జర.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పరులకర్మ!నెత్తిచూపివారికర్మ!వారుమానుచున్!
పురిటి!వేదనంబదేల?పోరుగోరి!కాలుదువ్వుచున్!
తరియజూడ!మోక్షమౌనె?తారుగొప్పతాముజాటుచున్!
పరిధిదాటి!సంచరింప!పౌరుషంబు జూపి !దోషులై!

10.గర్భగత"-జ్ఞానజీవి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతులు.10.19.
ప్రాసనీమముగలదు.
పరులకర్మ!నెత్తిజూపి!వారికర్మ వారుమానుచుం!పాడుటూహ!వీడరేల?
పురిటివేదనంబదేల?పోరుగోరికాలుదువ్వుచుం!బోడిచింత!మానరేల?
తరియజూడ!మోక్షమౌనె!తారుగొప్పతాముజాటుచుం!దాడినెంచుమార్గమేల?
పరిధిదాటి!సంచరింప!పౌరుషంబుజూపి!దోషులై! పాడియౌనె?  జీవితాన!

 స్వస్తి.
మూర్తి. జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సద్విశాల వృత్తము నందలి గర్భగత వృత్తములు అద్భుతముగా నున్నవి. పండితుల వారికి శిరసాభి వందనములు . ఆంధ్రామృతము ధన్య మైనది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.