గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, మార్చి 2018, గురువారం

మృదుపద,మత్తరజినీద్వయ,కృద్దోష,రజినీకరప్రియ,ద్వ్యర్ధీభావ,తగునటుద్వయ,వనరశూన్యద్వయ,గర్భ"-శూన్యభావి"-వృత్తము రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

 జైశ్రీరామ్.

మృదుపద,మత్తరజినీద్వయ,కృద్దోష,రజినీకరప్రియ,ద్వ్యర్ధీభావ,తగునటుద్వయ,వనరశూన్యద్వయ,గర్భ"-శూన్యభావి"-వృత్తము 
రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ 
"శూన్యభావి"వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.ర.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9.18.
ప్రాసనీమముగలదు.
జగతి వనరులెల్ల!స్వార్ధ చింత దోచి మ్రింగుచుం!సర్వశూన్యభావి నేర్చితే?
తగని తెగువ నొంది!ద్వ్యర్ధి భావ, చింత!రాగతం!తర్వరేమి?లోక దుర్గతిన్!
ప్రగతి మరతు రేల?వ్యర్ధ కృత్య దోష!చర్యలుం!పర్వమౌనె?పొంగిపోకుడీ!
వగవ!తుదికి మేలె?వర్ధితంబు!కావవెన్నడుం? పర్వు లెత్తు!రోజు లేర్పడున్!

1.గర్భగత"-మృదుపద"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.న.గల.గణముల.వృ.సం.192.ప్రాసగలదు.
జగతి!వనరులెల్ల?
తగని!తెగువ నొంది!
ప్రగతి!మరతు రేల?
వగవ!తుదికి మేలె?

2.గర్భగత"-మత్తరజినీద్వయ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.

స్వార్ధచింత!దోచి మ్రింగుచున్!    2.సర్వశూన్య!భావి నేర్చితే?
ద్వ్యర్ధిభావ!చింత రాగతన్!           తర్వవేమి?లోక దుర్గతిన్!
వ్యర్ధ కృత్య!దోష చర్యలున్!          పర్వమౌనె?పొంగి పోకుడీ!
వర్ధితంబు!కావవెన్నడున్?            పర్వులెత్తు!రోజులేర్పడున్!

3.గర్భగత"కృద్దోష"-వృత్తము..
అత్యష్టీఛందము.న.న.ర.జ.ర.లగ.యతి.9.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
జగతి వనరులెల్ల?స్వార్ధచింత!దోచి మ్రింగుచున్!
తగని!తెగువనొంది!ద్వ్యర్ధిభావ!చింత రాగతన్!
ప్రగతి!మరతు రేల?వ్యర్ధ కృత్య!దోష చర్యలున్!
వగవ!తుదికి మేలె?వర్ధితంబు!కావ వెన్నడున్?

4.గర్భగత"-రజినీకరప్రియ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
స్వార్ధ చింత!దోచి మ్రింగుచుం!సర్వశూన్య!భావి నేర్చితే?
ద్వ్యర్ధి భావ!చింత రాగతం!తర్వవేమి?లోక దుర్గతిన్!
వ్యర్ధ కృత్య!దోష చర్యలుం!పర్వమౌనె?పొంగి పోకుడీ!
 వర్ధితంబు!కావవెన్నడుం?పర్వులెత్తు!రోజులేర్పడున్!


5.గర్భగత"-ద్వ్యర్ధీభావ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.న.న.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
స్వార్ధచింత!దోచి మ్రింగుచుం!సర్వశూన్య!భావి నేర్చితే?జగతి!వనరులెల్ల?
ద్వ్యర్ధిభావ!చింత రాగతం?తర్వ వేమి?లోకదుర్గతిం!తగని!తెగువ!నొంది!
వ్యర్ధకృత్య!దోషచర్యలుం?పర్వమౌనె?పొంగిపోకుడీ!ప్రగతిమరుతురేల?
వర్ధితంబు!కావవెన్నడుం?పర్వులెత్తు!రోజులేర్పడున్!వగవ!తుదికి!మేలె?

6.గర్భగత"-తగునటు"-ద్వయవృత్తములు.
అత్యష్టీఛందము.ర.జ.ర.న.న.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
1.సర్వశూన్య!భావి నేర్చితే?జగతి వనరులెల్ల?
తర్వ వేమి?లోక దుర్గతిం!తగని తెగువ నొంది!
పర్వమౌనె?పొంగి పోకుడీ!ప్రగతి మరుతురేల?
పర్వులెత్తు!రోజులేర్పడుం!వగవ!తుదికి!మేలె?

2.స్వార్ధచింత!దోచి మ్రింగుచుం!జగతి వనరులెల్ల?
ద్వ్యర్ధిభావ!చింత రాగతం!తగనితెగువనొంది!
వ్యర్ధకృత్య!దోషచర్యలుం?ప్రగతి!మరుతురేల?
వర్ధితంబు!కావవెన్నడుం?వగవ!తుదికి మేలె?

7.గర్భగత"-వనరశూన్య"-ద్వయవృత్తములు.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.న.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
1.సర్వశూన్య!భావి నేర్చితే?జగతి వనరులెల్ల?స్వార్ధచింత!దోచి!మ్రింగుచున్!
తర్వవేమి?లోక దుర్గతిం?తగని తెగువనొంది!ద్వర్ధిభావ!చింత!రాగతన్!
పర్వమౌనె?పొంగి పోకుడీ?ప్రగతిమరుతురేల?వ్యర్ధకృత్య!దోషచర్యలున్?
పర్వులెత్తు!రోజులేర్పడుం?వగవతుదికి!మేలె?వర్ధితంబు!కావవెన్నడున్?

2.స్వార్ధచింత!దోచి మ్రింగుచుం!జగతి!వనరులెల్ల?సర్వశూన్య!భావినేర్చితే!
ద్వ్యర్ధిభావ!చింత రాగతం!తగని తెగువనొంది!తర్వవేమి?లోక దుర్గతిన్?
వ్యర్ధకృత్య!దోషచర్యలుం?ప్రగతి మరుతురేల?పర్వమౌనె?పొంగిపోకుడీ?
వర్ధితంబు!కావవెన్నడుం?వగవ తుదికి!మేలె?పర్వులెత్తు!రోజులేర్పడున్?

ఇట్లు,
తమవిశ్వసనీయుడు.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ వల్లభవఝులవారి కవనము లన్నియు మృదుమధురముగా నుండును .ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.