గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, మార్చి 2018, గురువారం

వెరగందనివృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
వెరగందనివృత్తము. 
రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.


వెరగందనివృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.న.న.ర.జ.న.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
పైన తీపి!లోన విషము!పలుకు తేనెలూరుచుండు!పరమ స్వార్ధచింతనన్!
దానమీయ!నిష్టపడరు!తలచు!కోటపేటలెల్ల!ధరను!పొందునందగన్!
వేనవేలు!మ్రింగు!తపన!విలుతులట్ల!వేటతప్ప!వెరగునందరిక్కలిన్?
మేనసిగ్గు!నందరకట?మెలగ మంచి నిచ్ఛలేక!మెరపుతీగె నిల్కడన్!

1.గర్భగత"-సాదృశీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.న.గణములు.వృ.సం.491.ప్రాసగలదు.
పైనతీపి!లోన విషము!
దానమీయ!నిష్టపడరు!
వేనవేలు!మ్రింగు!తపన!
మేనసిగ్గు!నందరకట?

2.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.ప్రాసగలదు.
పలుకు తేనెలూరుచుండు!
తలచు!కోట పేటలెల్ల?
విలుతులట్ల?వేట తప్ప!
మెలగ!మంచి నిచ్ఛ లేక!

3.గర్భగత"-అనఘా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.ర.లగ.గణములు.వృ.సం.88.ప్రాసగలదు.
పరమస్వార్ధ చింతనన్?
ధరను పొందునందగన్?
వెరగు నొందరిక్కలిన్!
మెరుపుతీగె!నిల్కడన్!

4.గర్భగత"-రజననరజా"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.న.న.ర.జ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పైన తీపి లోన విషము!పలుకు తేనెలూరు చుండు!
దానమీయ నిష్ట పడరు!తలచు కోట పేటలెల్ల!
వేన వేలు మ్రింగు తపన!విలుతులట్లు?వేటతప్ప!
మేనసిగ్గు నందరకట?మెలగ మంచి నిచ్ఛలేక!

5.గర్భగత"-నశోచయ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.న.ర.లగ.గణములు.యతి.10.వ.యక్షరము.ప్రాసనీమముగలదు.
పలుకు తేనె! లూరుచుండు!పరమ స్వార్ధచింతనన్!
తలచు కోట పేటలెల్ల!ధరణి పొందు నందగన్!
విలుతులట్ల వేటతప్ప? వెరగునందరిక్కలిన్?
మెలగమంచి!నిచ్ఛలేక!మెరపుతీగె నిల్కడన్!

6.గర్భగత"-పరమస్వస్వార్ధ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.న.ర.య.జ.భ.లల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.

పలుకు తేనెలూరుచుండు!పరమస్వార్ధ చింతనం!పైన తీపి లోన విషము!
తలచు కోట పేటలెల్ల!ధరను పొందు నందగం!దానమీయ నిష్టపడరు?
విలుతులట్ల?వేటతప్ప!వెరగునంద రిక్కలిం?వేనవేలు మ్రింగు తపన?
మెలగ మంచి నిచ్ఛలేక?మెరుపుతీగె నిల్కడం?మేన సిగ్గు!నందరకట?

7.గర్భగత"-వేనవేల"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.య.జ.భ.లల.గణములు.యతి.9.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
పరమ స్వార్ధచింతనం!పైనతీపి లోనవిషము!
ధరను పోందునందగం?దానమీయ నిష్ట పడరు!
వెరగు నందరిక్కలిం?వేనవేలు మ్రింగు తపన!
మెరపు తీగె నిల్కడం?మేన సిగ్గునంద రకట?

8.గర్భగత"-కల్మష"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.య.జ.భ.న.స.జ.గల.గణములు.యతులు9,18.
ప్రాసనీమముగలదు.
పరమస్వార్ధ చింతనం?పైనతీపి లోనవిషము!పలుకు తేనె లూరు చుండు?
ధరను పొందునందగం?దానమీయ!నిష్టపడరు?తలచు!కోట పేట లెల్ల?
వెరగు నంద రిక్కలిం?వేనవేలు మ్రింగు తపన?విలుతులట్లు వేటతప్ప?
మెరపుతీగె నిల్కడం?మేన సిగ్గునందరకట?మెలగ మంచి నిచ్ఛ పడక?

9.గర్భగత"-తేనెలూరు"-వృత్తము.
ధృతిఛందము.న.ర.జ.ర.జ.న.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పలుకు తేనెలూరుచుండు?పైన తీపి లోన విషము?
తలచు కోట పేట లెల్ల?దానమీయ నిష్టపడరు?

విలుతులట్ల?వేట తప్ప!వేనవేలు మ్రింగుతపన!
మెలగ మంచి నిచ్ఛలేక?మేన సిగ్గు నంద రకట?

10.గర్భగత"-తపనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.జ.న.న.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
.
పలుకు తేనె!లూరు చుండు!పైన తీపి లోన విషము!పరమస్వార్ధ!చింతనన్!
తలచు కోట పేటలెల్ల?దానమీయ నిష్టపడరు!ధరను పొందునందగన్!
విలుతులట్ల?వేటతప్ప!వేనవేలు మ్రింగు తపన?వెరగునందరిక్కలిన్!
మెలగమంచి!నిచ్ఛలేక?మేన సిగ్గు నందరకట?మెరపుతీగె నిక్కలిన్?

 స్వస్తి.
మూర్తి.జుత్తాడ.]
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
వృత్తము లన్నియు తేనె లూరుచున్నవి . శ్రీ వల్లభవఝులవారికి వేవేల నమస్కృతులు .శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
వృత్తము లన్నియు తేనె లూరుచున్నవి . శ్రీ వల్లభవఝులవారికి వేవేల నమస్కృతులు .శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.