గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, మార్చి 2018, సోమవారం

సద్విశాల,కీర్తలరు,చిత్తచైద,గర్భకీర్తిగామినీవృత్తము. రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

  జైశ్రీరామ్.
సద్విశాల,కీర్తలరు,చిత్తచైద,గర్భకీర్తిగామినీవృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.

కీర్తిగామినీవృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు 10,18.
ప్రాసనీమముగలదు.
చెరువు లోని చేపపిల్ల!చేర్చనొడ్డు!నీల్గినట్లు?చిత్తమొప్పుచేష్ట!ముప్పగున్?
సిరుల వెల్గు జీవితాలు!చెర్చునూహ!శోభమాపు!చిత్తుజేయు!ఖ్యాతినెల్లడున్! పరిసరాలుపాడుసేయ!పర్చుకీర్తియంటె!తప్పు?బత్తెమొల్లదెంచి చూడగన్?
తరుగు!భావిజీవనాడి!తర్చిచూడు!బుద్ధిపెట్టి!దత్త భూమి!దుత్త తీరగున్?

భావము:-చెరువునే!నివాసముగానెంచి బ్రతుకు చేపపిల్లను ఒడ్డునుచేర్చిన
జీవములు కోల్పోయినట్లు,మనసుకినచ్చిన పనియోచింపక చేసిన ముప్పు
వాటిల్లును.సిరులతో!తులతూగు,జీవితాలుమాపెడు,నూహ!శోభను చెరచును.ఖ్యాతిని మాపును.పరిసరాలను పాడుచేస్తేకీర్తిపెరుగునంటే!
తప్పేసుమా!ఊహించగా!ఇట్టి చర్య తిండికి,లోటేర్పచును.తర్కించగా
.భవిష్యత్తులో,జీవనాడితరగిపోవును.జనవినాశనహేతువగును.సువిశాలభూభాగము,దుత్తమాదిరి యగును.దుత్తయనగా నేతిపాత్ర .పరిమాణమున
చిన్నది.భూప్రమాణము, కారణాంతరముల వలన తగ్గును.

1.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.ప్రాసగలదు.
చెరువులోని!చేప పిల్ల!
సిరులవెల్గు!జీవితాలు!
పరిసరాలు!పాడుసేయ!
తరగు!భావి జీవనాడి!

2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
చేర్చనొడ్డు!నీల్గినట్లు?
చెర్చు నూహ!శోభ మాపు!
పర్చు!కీర్తి యంటె?తప్పు!
తర్చి!చూడు బుద్ధి పెట్టి!

3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
చిత్తమొప్పు!చేష్ట ముప్పగున్!
చిత్తుజేయు!ఖ్యాతి నెల్లడున్!
బత్తెమొల్లదెంచిచూడగగన్!
దత్తభూమి!దుత్త తీరగున్!
దత్తభూమి=భగవంతుడిచ్చిన!భూభాగము.

4.గర్భగత"-భావినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.ర.జ.గల.గణములు.యతి.10.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
చెరువులోని చేపపిల్ల చేర్చ నొడ్డు!నీల్గినట్లు?
సిరుల వెల్గు జీవితాలు!చెర్చు నూహ!శోభమాపు!
పరిసరాలు పాడుచేయ!పర్చు కీర్తి!యంటె?తప్పు!  .
తరగుభావి జీవనాడి!తర్చి చూడు!బుద్ధి పెట్టి!

5.గర్భగత"-యతిర్నవసుగంధి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చేర్చ నొడ్డు నీల్గినట్లు?చిత్తమొప్పు చేష్ట ముప్పగున్!
చెర్చు నూహ!శోభ మాపు!చిత్తుజేయు!ఖ్యాతి నెల్లడున్?
పర్చుకీర్తి!యంటె తప్పు?బత్తె మొల్ల దెంచి చూడగన్?
తర్చిచూడ బుద్ధి పెట్టి!దత్త భూమి!దుత్త తీరగున్!

6.గర్భగత"-నియమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.జ.స.జ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
చేర్చనొడ్డు!నీల్గినట్లు?చిత్తమొప్పు!చేష్ట ముప్పగున్?చెరువులోని!చేపపిల్ల!
చెర్చునూహ!శోభమాపు!చిత్తుజేయుఖ్యాతి నెల్లడున్?సిరులవెల్గు!జీవితాలు
పర్చుకీర్తియంటె? తప్పు!బత్తెమొల్లదెంచి!చూడగం?పరిసరాలు!పాడుసేయ!
తర్చిచూడ!బుద్ధిపెట్టి!దత్తభూమి!దుత్త తీరగుం!తరగు! భావి జీవనాడి!

7.గర్భగత"-అమూల్య"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.న.ర.జ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చిత్తమొప్పు చేష్ట ముప్పగున్?చెరువులోని చేపపిల్ల!
చిత్తుజేయు!ఖ్యాతి!నెల్లడున్?సిరులవెల్గుజీవితాలు!
బత్తెమొల్లదెంచి చూడగన్?పరిసరాలు పాడుసేయ!
దత్తభూమి!దుత్తతీరగున్?తరుగు!భావి జీవనాడి!

8.గర్భగత"-సద్విశాల"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.ర.జ.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
చిత్తమొప్పు చేష్ట ముప్పగుం?చెరువులోని!చేపపిల్ల!చేర్చనొడ్డు!నీల్గినట్లు?
చిత్తుజేయు!ఖ్యాతినెల్లడుం?సిరులవెల్గు!జీవితాలుచెర్చునూహ!శోభమాపు!
బత్తెమొల్లదెంచిచూడగం?పరిసరాలు!పాడుసేయ!పర్చుకీర్తియంటెతప్పు?
దత్తభూమి!దుత్తతీరగుం?తరగు భావి జీవనాడి!తర్చిచూడ!బుద్ధి!పెట్టి!

9.గర్భగత."-కీర్తలరు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.జ.జ.గల.గణములు.యతి.9.వ.యక్షరము.
చేర్చనొడ్డు!నీల్గినట్లు?చెరువులోని!చేపపిల్ల!
చెర్చునూహ!శోభమాపు!సిరులవెల్గు!జీవితాలు!
పర్చు కీర్తియంటె?తప్పు!పరిసరాలు!పాడుసేయ!
తర్చిచూడ!బుద్ధిపెట్టి!తరగుభావి!జీవనాడి!

10.గర్భగత"-చిత్తచేష్ట"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.జ.జ.ర.జ.ర.లగగణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
చేర్చనొడ్డు!నీల్గినట్లు?చెరువులోని!చేపపిల్ల!చిత్తమొప్పుచేష్ట!ముప్పగున్?
చెర్చునూహ!శోభమాపు!సిరులవెల్గుజీవితాలు!చిత్తుసేయు!ఖ్యాతినెల్లడున్!
పర్చుకీర్తియంటె!తప్పు?పరిసరాలు!పాడుసేయ?బత్తెమొల్లదెంచిచూడగన్!
తర్చిచూడ!బుద్ధిపెట్టి!తరగు భావిజీవనాడి!దత్తభూమి!దుత్త తీరగున్?

స్వస్తి.


మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.