గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, మార్చి 2018, సోమవారం

శ్రీరామ నవమి సందర్భముగా మీ అందరికీ నా శుభాకాంక్షలు

జైశ్రీరామ్.
ఆర్యులారా! శుభోదయమ్.
శ్రీ సీతారామచంద్రపరబ్రహ్మణేనమః.
ఈ రోజు పరమ పావనమైన సీతారాముల కల్యాణ మహోత్సవము జరుపుకొను మహోత్కృష్టమైన రోజు శ్రీరామ నవమి.
ఈ సందర్భముగా మీ అందరికీ ఆ సీతారాముల ఆశీస్సులు అపారముగా అందాలని కోరుకొంటూ మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
శా. ఎన్నో జన్మల పుణ్య సత్ఫలముగానిద్ధాత్రి సీతమ్మ నీ
కన్నుల్ కాంతిగ వెల్గ నీ సతిగ భూకాంతారమావల్లభా.
మిన్నున్ ముట్టదె మాదు సంబరము సామీ చేయ మీ పెండ్లి. శ్రీ
మన్నారాయణ! భక్తులన్ సతము ప్రేమంజూచి దీవింపుడీ.  
భావము.
ఓ శ్రీమన్నారాయణా! ఓభూకాంతారమావల్లభా! ఓ స్వామీ! పెక్కు జన్మలలో చేసిన
పుణ్యఫలముగా ఈ ధాత్రిపై సీతమ్మతల్లి నీ పత్నియై నీ కన్నులలో కాంతియై
ప్రకాశించు విధముగా మీ వివాహము చేయుటచే మా సంతోషము ఆకాశమునంటును.
మీరెల్లప్పుడూ భక్తులను కృపతో చూచుచు దీవించుడు.
జైహింద్


Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ రమావల్లభునిపై చక్కని పద్యమును మాకందించి నందులకు ధన్య వాదములు
శ్రీరామ నవమి శుభాకాంక్షలు .దీవించి అక్క

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.