గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, మార్చి 2018, బుధవారం

ప్రథమ వయసి పీతం తోయమల్పం స్మరన్తః . . . మేలిమి బంగారం మన సంస్కృతి,


జైశ్రీరామ్.
శ్లో. ప్రథమ వయసి పీతం తోయమల్పం స్మరన్తః
శిరసి నిహిత ధారాః నారికేలా నరాణామ్.
సలిలమమృత కల్పం దద్యురాజీవనాంతమ్,
నహి కృతముపకారం సాధవో విస్మరంతి. 
श्लॊ. प्रथम वयसि पीतं तॊय मल्पं स्मरन्तः।
      शिरसि निहित धाराः नारिकेळा नराणां।
      सलिल ममृत कल्पं दद्यु राजीवनान्तं।
      न हि कृत मुपकारं साधवॊ विस्मरन्ति॥

पश्यन्तु। अयं श्लॊकः अतीव सरळः। सुन्दरः। सन्देशात्मकः। नीतिदायक श्च।
संस्कृते वाङ्मये एतादृश श्लॊकाः बहव स्सन्ति खलु। सर्वे जानन्त्येव। संस्कृत
वाण्यां कवित्वं बहु रम्यं धर्म्यं च। "हितं मनॊहारि च दुर्लभं वचः" इति आभाणकं खलु। परन्तु एतद्वचः संस्कृते वाङ्मये लभ्यते ति सुमनसा मनुभवः।
ఉ. నీరము పోసి బాల్యమున నేర్పుగ రక్షణ చేసి, పెంచినా
రీనరపుంగవుండనుచు నీప్సిత చిత్తము తోడ నేర్పుతో
వారి సుపూర్ణ కేళములవారిత రీతినొసంగునెప్పుడున్
ధీరత నారికేళతరు ధీమణి సద్గుణ సంస్తుతాత్మయై.
భావము. తనకు చిన్న తనముతో నీరుపోసి రక్షైంచి పెంచెనీమనుఁఝుఁడని తలపోసి కొబ్బరి చెట్టు ఆ చేసిన ఉపకారమును మరువలేక తాను జీవించి యున్నంత కాలము, తన శిరమున మోసి కాయలద్వారా కొబ్బరి నీటిని, కొబ్బరిని అందించుచునే యుండును. మంచివారు తాము పొందిన ఉపకారములనెన్నటికీ మరురువరు. ప్రత్యుపకారము చేయుచునే ఉందురు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును మంచి విషయములను అందించినందులకు ధన్య వాదములు. నిజంగానే మేలిమి బంగారం మన సంస్కృతి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.