జైశ్రీరామ్.
శ్లో.యథా సునిపుణ: సమ్యక్! పరదోషే క్షణే రతః! తథాచేన్నిపుణః స్వేషు! కోనముచ్యేత బంధనాత్!!
చ.ఇతరుల దోషముల్ వెదక నెవ్వరు కల్గుదురట్టివారు తా
సతతము వారి దోషములు చక్కఁగ గాంచి చెలంగిరేని స
న్నుతమగు సత్పథంబున గనుంగొన జాలుదురయ్య ముక్తి. సం
స్తుతమతిమంతులెప్పుడును దోషములెంచరు సుస్వభావులై.
భావము.ఇతరుల దోషముల నెంచుట లో చూపు సహజ చాకచక్యమును,తెలివినీ తమ
దోషములను గుర్తించుటలో వినియోగించినచో వాడు సంసార బంధనమునుండి విముక్తి
చెందును.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అందరు గ్రహించ వలసిన మంచి సందేశము. ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.