గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, మార్చి 2018, ఆదివారం

శ్రీవిళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శుభోదయమ్.

82. శా. తిన్నన్ జాలు నుగాది పచ్చడిని, భాతిం గొల్పు నొరోగ్యమున్,
విన్నన్ జాలును భూసురుల్ పలుకు భావిన్దెల్పు పంచాంగమున్.
కన్నా దివ్య యుగాదినాడునిజ సంకల్పంబులీడేరు. శ్రీ
మన్నారాయణ! నిత్య చేతనమిడన్ మాలోనుగాదైతివా
18 . 03 . 2018.

భావము.
ఓశ్రీమన్నారాయణా! ఓ కన్న తండ్రీ. ప్రతీ సంవత్సరమూ 
ఉగాది రోజున ఉగాది పచ్చడిని తినిన చాలును. 
భాతిని, ఆరోగ్యమును కలిగించును. భూదేవతలు పలికెడి
భావిని తెలియజేయు పంచాంగమును వినీనసరిపోవును. 
మా సంకల్పములన్నియు నెరవేరును. 
మాలో నిత్య చైతన్యము కల్పించుటకు 
నీవు మాలో ఉగాదివై
యుంటుందువా.
స్వస్తి. శ్రీ చాంద్రమాన విళంబి నామ సంవత్సర ఉగాది సందర్భముగా మీ అందరికీ ఆయురారోగ్య ఆనంద ఐశ్వర్య సౌఖ్య సౌభాగ్యాలను ఆ శ్రీమన్నారాయణుడు వృద్ధిచేయాలని మనసారా కోరుకొంటూ మీకు అభినందనపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను.
దిగువనున్నది
విళంబి తంగిరాలవారి పంచాంగమ్. లంకె.
https://drive.google.com/file/d/18W1EYuCQdIB2iSfMRhArnFbvPthy2y4C/view?usp=drive_web
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మీకు , మరదలికీ, పిల్లలకీ, మనవలకీ ,అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు . సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ , మరిన్ని శతకాలువ్రాయాలని ఆశీర్వదించి అక్క .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.