జైశ్రీరామ్.
భారణా,నుతిదా,చీకట్లల రు,సమీపక,మూర్తిమత్వ, మంత్రబద్ధ,కీర్తనీ,మచ్చ గాని,తంత్రదూర,మథురనా యకీ, గర్భ భ్రమితోత్పల వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
భ్రమితోత్పల వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.న.న.భ.భ.ర.య. లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
మాయని మచ్చగాకుమయ!మథురనాయకి నీదరిమంత్రబద్ధయై నిల్చినన్!
కాయ మశాశ్వతంబు గద!కదియు,శ్రీలకునీవియు!తంత్రదూ రతన్నిల్వుమా!
చేయుమి!సత్కృతంబులును!శిధిలమేర్ చని కీర్తుల!'శ్రీం'-త్రిమూర్తిమత్ వంబుగా
ఆయువు!దీర్ఘమౌను!గదె!యదియె!భూ తలస్వర్గము!యాంత్రికంబునైజనున్!
1.గర్భగత"-భారణా"-వృత్తము.
బృహతీఛందము.భ.ర.న.గణములు.వృ.సం. 471.ప్రాసగలదు.
మాయని మచ్చ గాకు మయ!
కాయ మశాశ్వతంబు గద!
చేయుమి!సత్కృతంబులును!
ఆయువు దీర్ఘమౌను గదె!
2.గర్భగత"-నుతిదా"-వృత్తము.
బృహతీఛందము.న.భ.భ.గణములు.వృ.సం. 440.ప్రాసగలదు.
మథుర నాయకి!నీదరి!
కదియు శ్రీలకు! నీవియు!
శిధిల మేర్చని కీర్తుల!
నదియె! భూతల స్వర్గము!
3.గర్భగత"-చీకట్లలరు"-వృత్తము.
అనుష్టప్ఛందము.ర.య.లగ.గణములు.వృ .సం.75.ప్రాసగలదు.
మంత్రబద్ధయై!నిల్చినన్!
తంత్ర దూరతన్నిల్వుమా!
శ్రీం-త్రిమూర్తిమత్వంబుగా!
యాంత్రికంబునై జనున్!
4.గర్భగత"-సమీపక"-వృత్తము.
ధృతిఛందము.భ.ర.న.న.భ.భ.గణములు. యతి10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మాయని మచ్చ!గాకుమయ!మధురనాయకి!నీదరీ!
కాయ మశాశ్వతంబుగద!కదియు,శ్రీలకు నీవియు!
చేయుమి!సత్కృతంబులును!శిధిలమేర్ చని!కీర్తుల!
ఆయువు!దీర్ఘమౌను గదె!నదియె! భూతలస్వర్గము!
5.గర్భగత"-మూర్తిమత్వ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.భ.ర.య.లగ. గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మథుర నాయకి నీదరిమంత్రబద్ధయై నిల్చినన్!
కదియుశ్రీలకు!నీవియు! తంత్ర దూరతం నిల్వుమా!
శిధిల మేర్చని కీర్తుల!శ్రీం-త్రిమూర్తి మత్వంబుగా!
అదియె!భూతల స్వర్గము! యాంత్రికంబునై!జనున్!
6.గర్భగత"-మంత్రబద్ధ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.భ.భ.ర.య.య.ర.జ. లల.గణములు.యతులు.10.18
ప్రాసనీమముగలదు.
మథుర!నాయకి!నీదరిమంత్రబద్ధయై!ని ల్చినం!మాయనిమచ్చ!గాకుమయ!
కదియు!శ్రీలకు!నీవియు!తంత్రదూ రతం!నిల్వుమా!కాయమశాశ్వతంబుగద!
శిధిలమేర్చని!కీర్తుల!శ్రీం-త్ రిమూర్తిమత్వంబుగా!చేయుమి!సత్కృ తంబులును!
అదియె!భూతల!స్వర్గము!యాంత్రికం బునై!జనున్నాయువు!దీర్ఘమౌనుగదె!
7.గర్భగత"-కీర్తనీ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.య.య.స.జ.లల. గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మంత్రబద్ధయై!నిల్చినం!మాయనిమచ్ చ!గాకుమయ!
తంత్రదూరతంనిల్వుమా!కాయ మశాశ్వతంబుగద!
శ్రీం-త్రిమూర్తిమత్వంబుగా!జేయు మి!సత్కృతంబులును!
యాంత్రికంబునై!జనున్నాయువుదీర్ ఘమౌను!కదె!
8.గర్భగత"-మచ్చగాని"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.య.య.స.జ.న.స.స. లల.గణములు.యతులు.9.18.
ప్రాసనీమములచినం
మంత్రబద్ధయై!నిల్చినం!మాయనిమచ్ చగాకుమయ!మథురనాయకి!నీదరి!
తంత్రదూరతన్నిల్వుమా!కాయమశాశ్ వతంబుగద!కదియు!శ్రీలకు!నీవియు!
శ్రీం-త్రిమూర్తిమత్వంబుగా!జేయు మి!సత్కృతంబులును!శిధిలమేర్చని! కిర్తుల
యాంత్రికంబునై!జనున్నాయువు!దీర్ ఘమౌనుగదె!నదియె!భూతలస్వర్గము!
9.గర్భగత"-తంత్రదూర"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.య.జ.స.స.లల. గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మంత్రబద్ధయై!నిల్చినం!మథురనాయకి !నీదరి!
తంత్రదూరతన్నిల్వుమా!కదియు!శ్రీ లకు!నీవియు!
శ్రీం-త్రిమూర్తి!మత్వంబుగా!శి ధిలమేర్చని!కీర్తుల!
యాంత్రికంబునైజనున్నదియె!భూతల! స్వర్గము!
10.గర్భగత"-మథురనాయకీ"-వృత్తము.
ఉత్కృతిచందము.ర.య.జ.స.స.స.స.జ. లల.గణములు.యతులు.9.18.
ప్రాసనీమముగలదు.
మంత్రబద్ధయై!నిల్చినం!మథురనాయకి !నీదరి!మాయని మచ్చగాకుమయ!
తంత్రదూరతన్నిల్వుమా!కదియుశ్రీ లకు!నీవియు!కాయమశాశ్వతంబుగద!
శ్రీం-త్రిమూర్తి మత్వంబుగా!శిధిలమేర్చని!కీర్తు ల!జేయుమి!సత్కృతంబులును
యాంత్రికంబునై!జనున్నదియె!భూ తలస్వర్గము!నాయువు!దీర్ఘమౌను! కద!
స్వస్తి..
మూర్తి. జుత్తాడ.
జైహింద్.
1 comments:
నమస్కారములు
శ్రీ వల్లభవఝుల వారి పాండిత్యాన్ని మేము ఆస్వాదించ గలుగుతున్న అదృష్ట వంతులము. మాకందిస్తున్న శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.