గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఫిబ్రవరి 2018, సోమవారం

గర్భ ప్రపూర్ణ వృత్తము. .. .. .. రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్.
గర్భ ప్రపూర్ణ వృత్తము.
                                               రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
 జుత్తాడ.

ప్రపూర్ణ వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.జ.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
భావస్ఫురణ వ్యక్తపర్చు!వాసిగన్న!కీర్తినొందు!భవ్యుడీవు!మానవా!శుభా!ధీవరుడవు!దీన బంధొ!తీసి పారవేయ కేర్ని!దివ్యమౌ!ప్రపూర్ణ మందుమా!
కావరమును!వీడి!మెల్గు!గాసిలంగ!నేల?నోయి!కావ్యకీర్తి!పెంపుజేయుమా!
స్థావరములె!శ్రీవరాలు!దాసిగాక!భుక్తినందు!నవ్యమైన!జ్ఞాన జ్యోతులన్!
ఏర్ని=ఎవ్వరిని

1.గర్భగత"-భాసిజ"-వృత్తము.
బృహతీఛందము.భ.స.జ.గణములు.వృ.సం.351.ప్రాసగలదు.
భావస్ఫురణ!వ్యక్తపర్చు!
ధీవరుడవు!దీనబంధొ!
కావరమును!వీడి!మెల్గు!
స్థావరములె!శ్రీవరాలు!

2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
వాసిగన్న!కీర్తినొందు!
తీసి పారవేయ కేర్ని!
గాసిలంగనేల?నోయి!
దాసిగాక!భుక్తి!నందు!

3.గర్భగత"-మత్తరజనీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
భవ్యుడీవు!మానవా!శుభా!
దివ్యమౌ!ప్రపూర్ణమందుమా! 
కావ్యకీర్తి!పెంపు!జేయుమా!
నవ్యమైనజ్ఞాన! జ్యోతులన్!

4.గర్భగత"-భావస్ఫురణ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.స.జ.ర.జ.గల.గణములు.యతి10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
భావస్ఫురణ వ్యక్త పర్చు!వాసిగన్న!కీర్తినొందు!
ధీవరుడవు!దీన బంధొ! తీసి పారవేయ!కేర్ని!
కావరమును!వీడి మెల్గు!గాసిలంగనేల?నోయి!
స్థావరములె!శ్రీవరాలు! దాసిగాక!భుక్తి!నందు!

5.గర్భగత."-యతిర్నవ!సుగంధినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి09వయక్షరము.
ప్రాస నీమముగలదు.
వాసిగన్న!కీర్తి నొందు!భవ్యుడీవు!మానవా!శుభా!
తీసి పారవేయ కేర్ని!దివ్యమౌ!ప్రపూర్ణమందుమా!
గాసిలంగ!నేలనోయి?కావ్యకీర్తి!పెంపుజేయుమా!
దాసిగాక!భుక్తి నందు!నవ్యమైన!జ్ఞాన!జ్యోతులన్!

6.గర్భగత"-వచసా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.య.న.జ.గల.గణములు.యతులు.09.18.
ప్రాసనీమముగలదు.
వాసిగన్న!కీర్తినొందు!భవ్యుడీవు!మానవా!శుభా!భావస్ఫురణ!వ్యక్త!పర్చు!
తీసిపారవేయ!కేర్ని!దివ్యమౌ!ప్రపూర్ణమందుమా!ధీవరుడవు!దీన బంధొ!
గాసిలంగనేల నోయి?కావ్యకీర్తిపెంపుజేయుమా!కావరమును!వీడి!మెల్గు!
దాసిగాక!భుక్తినందు!నవ్యమైనజ్ఞానజ్యోతులన్!స్థావరములె!శ్రీవరాలు!

7.గర్భగత"-స్ఫూర్తినీ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.భ.స.జ.గణములు.యతి10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
భవ్యుడీవు!మానవా!శుభా!భావస్ఫురణ!వ్యక్త పర్చు!
దివ్యమౌ!ప్రపూర్ణమందుమా!ధీవరుడవు!దీన బంధొ!
కావ్యకీర్తి!పెంపు జేయుమా!కావరమును!వీడి మెల్గు!
నవ్యమైన!జ్ఞాన జ్యోతులన్!స్థావరములె!శ్రీవరాలు!

8.గర్భగత"-దీనబంధు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.భ.స.జ.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
భవ్యుడీవు!మానవా!శుభా!భావస్ఫురణ!వ్యక్తపర్చు! వాసిగన్న!కీర్తి నొందు!
దివ్యమౌ!ప్రపూర్ణ మందుమా!ధీవరుడవు!దీనబంధొ!తీసిపారవేయ!కేర్ని
కావ్యకీర్తిపెంపు!జేయుమా!కావరమునువీడి మెల్గు!గాసిలంగ!నేలనోయి?
నవ్యమైన!జ్ఞానజ్యోతులన్!స్థావరములె!శ్రీవరాలు!దాసిగాక!భుక్తి!నందు!

9.గర్భగత"-రజోర్నజ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.న.జ.గల.గణములు.యతి09వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
వాసిగన్న!కీర్తునొందు!భావస్ఫురణ!వ్యక్త పర్చు!
తీసి పారవేయ!కేర్ని!ధీవరుడవు!దీనబంధొ!
గాసిలంగనేల?నోయి!కావరమును!వీడి మెల్గు!
దాసిగాక!భుక్తి!నందు!స్థావరములె!శ్రీవరాలు!

10.గర్భగత"-వాసిలు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.09,18.
ప్రాసనీమముగలదు.
వాసిగన్న!కీర్తినొందు!భావస్ఫురణ!వ్యక్తపర్చు!భవ్యుడీవు!మానవా!శుభా!
తీసిపారవేయ!కేర్ని!ధీవరుడవు!దీనబంధొ!దివ్యమౌ!ప్రపూర్ణ!మందుమా!
గాసిలంగనేల?నోయి!కావరమునువీడి!మెల్గు!కావ్యకీర్తి!పెంపు జేయుమా!
దాసిగాక!భుక్తినందు!స్థావరములె!శ్రీవరాలు!నవ్యమైన!జ్ఞానజ్యోతులన్!

స్వస్తి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఆంధ్రామృతం సాహితీ సుధలను కురిపి స్తున్నందులకు నమోవాకములు. శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.