గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఫిబ్రవరి 2018, బుధవారం

లీలాపాలన,భావస్ఫూర్తి,తెలివెలుగు.గర్భ కవిరాజ వృత్తము. రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ

జైశ్రీరామ్.
లీలాపాలన,భావస్ఫూర్తి,తెలివెలుగు.గర్భ కవిరాజ వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ

కవిరాజ వృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.మ.స.భ.ర.న.న.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
అనితర సాధ్య కష్టాలన్నవలీలందొలగింతువే!యలసితి గనవేమీ?
కని సరిగాచు మల్లేశా!కవనాలంకృత1ఱేనివై!కలమును నడపన్రా!
తనియగ జేయవా!దేవా!తవభావాలందీపిలం!తలపడి లిఖియింపన్!
తెనుగును తీర్చు!సర్వేశా!దివిజుల్మెచ్ఛగ నింపుగా!తెలివొసగుమ!శంభో!

1గర్భగత"-అభయాశ్రి"-వృత్తము.
 బృహతీఛందము.న.జ.మ.గణములు.వృ.సం.48.ప్రాసగలదు.
అనితర సాధ్య కష్టాలన్!
కని!సరిగాచు! మల్లేశా!
తనియగ!జేయవా!దేవా!
తెనుగును!తీర్చు!సర్వేశా!

2.గర్భగత"-విశ్వసౌఖ్య"-వృత్తము.
బృహతీఛందము.స.భ.ర.గణములు.వృ.సం.180.ప్రాసగలదు.
అవలీలం దొలగింతువే!
కవనాలంకృత!ఱేనివై!
తవ!భావాలం!దీపిలన్!
దివిజుల్మెచ్చగ!నింపుగా!

3.గర్భగత"-యశోవిరాజి"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.న.గగ.గణములు.వృ.సం.64.ప్రాసగలదు.
అలసితి!గనవేమీ!
కలమును!నడపన్రా!
తలపడి!లిఖియింపన్!
తెలివొసగుమ!శంభో!

4.గర్భగత"-కావ్యశోభ!"-వృత్తము.
ధృతిఛందము.న.జ.మ.స.భ.ర.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
అనితరసాధ్య!కష్టాలన్నవలీలందొలగగింతువే!
కని!సరిగాచు మల్లేశా!కవనాలంకృత!ఱేనివై!
తనియగ!జేయవా!దేవా!తవ!భావాలను!దీపిలన్!
తెనుగును!తీర్చు!సర్వేశా!దివిజుల్మెచ్చగ!నింపుగా!

5.గర్భగత"-ఆపన్న"-వృత్తము.
అత్యష్టీఛందము.స.భ.ర.న.గగ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
అవలీలందొలగింతువే!యలసితి!గనవేమీ?
కవనాలంకృత!ఱేనివై!కలమునునడపపన్రా!
తవభావాలను!దీపిలందల్పడి!లిఖియింపన్!
దివిజుల్మెచ్చగ!నింపుగా!తెలివొసగుమ!శంభో!

6.గర్భగత"-లోకపూజ్య"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.భ.ర.న.న.త.న.ర.గగ.గణములు.యతులు.10.18.
ప్రాసనీమముగలదు.
అవలీలందొలగింతువే!యలసితిగనవేమి?అనితర సాధ్య కష్టాలన్!
కవనాలంకృత ఱేనివై!కలమును నడపన్రా!కని సరిగాచు!మల్లేశా!
తవ భావాలను!దీపిలందల్పడి!లిఖియింపం!తనియగ!జేయవా!దేవా!
దివిజుల్మెచ్చగ నింపుగా!తెలివొసగుమ!శంభో!తెనుగునుదీర్చు!సర్వేశా!

7.గర్భగత"-సరితీర్చు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.త.న.ర.గగ.గణములు.యతి.9.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
అలసితి!గనవేమీ!అనితర సాధ్య కష్టాలన్!
కలమును!నడపన్రా! కని సరిగాచు!మల్లేశా!
తలపడి!లిఖియింపందనియగ!జేయవా!దేవా!
తెలివొసగుమ!శంభో!తెనుగునుదీర్చు!సర్వేశా!

8.గర్భగత"-లీలాపాలన"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.త.న.ర.స.జ.స.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
అలసితి!గనవేమీ?అనితరసాధ్య కష్టాలం!యవలీలందొలగింతువే!
కలమును!నడపం!రా!కని,సరిగాచు!మల్లేశా!కవనాలంకృతఱేనివై!
తలపడి!లిఖియింపం!దనియగ!జేయవా!దేవా!తవ భావాలందీపిలన్!
తెలివొసగుమ!శంభో!తెనుగును!దీర్చు!సర్వేశా!దివిజుల్మెచ్చగ!నింపుగా

9.గర్భగత"-భావస్ఫూర్తి"-వృత్తము.
ధృతిఛందము.స.భ.ర.న.జ.మ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
అవలీలందొలగింతువే!అనితర!సాధ్య కష్టాలన్!
కవనాలంకృత!ఱేనివై!కని,సరిగాచు!మల్లేశా!
తవ భావాలందీపిలం!తనియగ!జేయవా?దేవా!
దివిజుల్మెచ్చగ!నింపుగా!తెనుగును!దీర్చు!సర్వేశా!

10.గర్భగత"-తెలివెలుగు"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.భ.ర.న.జ.మ.న.న.గగ.గణములు యతులు.10,19.
ప్రాసనీమముగలదు.      
అవలీలందొలగింతువే!అనితర సాధ్య కష్టాలం!అలసితి గగనవేమీ
కవనాలంకృత ఱేనివై!కని ,సరిగాచు!మల్లేశా!కలమును!నడపన్రా!
తవ భావాలం!దీపిలం!తనియగ!జేయవా!దేవా!తలపడి!లిఖియింపన్!
దివిజుల్మెచ్చగ!నింపుగా!తెనుగును!దీర్చు!సర్వేశా!తెలివొసగుమ!శంభో!
స్వస్తి.
మూర్తి. జుత్తాడ
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అద్భుత మైమ వృత్తముల పేర్లతో మరింత వీనుల విందగు పద్య రచనలు మాకందిస్తున్న శ్రీ వల్లభవఝులవారికి శిరసాభి వందనములు శ్రీ చింతా సోదరులకు కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.