జైశ్రీరామ్.
జుంటితేనె,రుచికర,గర్భ.అభిలాషవృ త్తము.
రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుతాడ
సాదృశీవృత్తము.
బృహతీఛందము.ర.జ.న.గణములు.వృ.సం .491.
ప్రాసగలదు.
మర్చిపోకు తెల్గు నెపుడు!
మార్చి వేకు నామె సొబగు!
కూర్చు శక్తి పూజ్యతలర!
తీర్చి దిద్దు తెన్గు ఘనత!
గర్భ కవిత.
అభిలాష వృత్తము.
అభికృతిఛందము.త.జ.ర.జ.న.భ.జ.ర. ల.గణములు.యతులు.09,18.
ప్రాసనీమముగలదు.
ఛందో వరదాల మిన్న!జుంటి తేనె రుచికి సాటి!సుమ సౌర భాల తెల్గు!
స్ఫందం బవధాన కీర్తి!బంటు నైన ఘనుని జేయు!సమ సామ్య మేర్చు జాతి!
గంధం బిది భావస్ఫూర్తి!కంటివెల్గు శుభ వరాశి!గమనంబు తీర్చు నీతి!
బంధంబును త్రెంచ కండి!బంధి గాకు పరుల భాష!భ్రమలేదతతెల్గు నేర్వ!
1.గర్భగత"-తరంగ"-వృత్తము
అనుష్టుప్ఛందము.త.జ.గల.గణములు. వృ.సం.173.ప్రాసగలదు.
ఛందో వరదాల మిన్న!
స్ఫందం బవధాన కీర్తి!
గంధంబిది భావ స్ఫురణ!
బంధంబును త్రెంచ కండి!
2.గర్భగత"-భ్రమక"-వృత్తము.
బృహతీఛందము.ర.న.జ.గణములు.వృ.సం. 379.ప్రాసగలదు.
జుంటి తేనె రుచికి సాటి!
బంటు నైన ఘనుని జేయు!
కంటి వెల్గు! శుభవరిాశి!
బంధి గాకు పరుల భాష!
3.గర్భగత"-జగతీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.జ.గల.గణములు. వృ.సం.172.ప్రాసగలదు.
సుమ సౌరభాల తెల్గు!
సమ సామ్య మేర్చు జాతి!
గమనంబు తీర్చు నీతి!
భ్రమ లేద? తెల్గు నేర్వ!
4.గర్భగత"-రుచిర"-వృత్తము.
అత్యష్టీఛందము.త.జ.ర.జ.న.గల. గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఛందో వరదాల మిన్న!జుంటి తేనె రుచికి సాటి!
స్ఫందంబవధాన కీర్తి!బంటు నైన ఘనుని జేయు!
గంథం బిది భావ స్ఫూర్తి!కంటివెల్గు! శుభ వరాశి!
బంధంబును త్రెంచ కండి!బంధి గాకు పరుల భాష!
5.గర్భగత"-సురభి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.న.జ.స.జ.గల. గణములు.యతి.10వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
జుంటి తేనె రుచికి సాటి!సుమ సౌరభాల తెల్గు!
బంటు నైన ఘనుని జేయు!సమసామ్య మేర్చు జాతి!
కంటి వెల్గు! శుభ వరాశి!గమనంబు తీర్చు నీతి!
బంధి గాకు! పరుల భాష!భ్రమ లేద? తెల్గు నేర్వ!
6.గర్భగత"-తేట తెన్గు"-వృత్తము.
అష్టీఛందము.స.జ.ర.భ.ర.ల.గణములు. యతి.9.వ.యక్షరము.
ప్రాస నీమముగలదు.
సుమ సౌరభాల తెల్గు!ఛందో వరదాల మిన్న!
సమ సామ్య మేర్చు!జాతి!స్ఫందం బవధానకీర్తి!
గమనంబు తీర్చు నీతి!గంథంబిది భావ స్ఫూర్తి!
భ్రమ లేద?తెల్గు నేర్వ!బంధంబును త్రెంచకండి!
7.గర్భగత"-మథుసరి"-వృత్తము
అష్టీ ఛందము.ర.న.జ.త.జ.గల.గగణములుయతి. 9.వ.యక్షరము.
ప్రాస నీమముగలదు.
జుంటి తేనె రుచికి సాటి!ఛందో వరదాల మిన్న!
బంటు నైన ఘనుని జేయు!స్ఫందం బవధాన కీర్తి!
కంటి వెల్గు శుభ వరాశి!గంథంబిది భావ స్ఫూర్తి!
బంధి గాకు పరుల భాష!బంధంబును త్రెంచకండి!
8.గర్భగత"-సుమ సౌరభ"-వృత్తము.
అభికృతిఛందము.ర.న.జ.స.జ.ర.భ.ర. ల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
జుంటి తేనె రుచికి సాటి!సుమ సౌరభాల తెల్గు!ఛందో వరదాల మిన్న!
బంటు నైన ఘనుని జేయు!సమసామ్య మేర్చు జాతి!స్ఫందంబవధాన కీర్తి!
కంటివెల్గు శుభ వరాశి!గమనంబు తీర్చు నీతి!గంథంబిది భావ స్ఫూర్తి!
బంధిగాకు పరుల భాష!భ్రమ లేద?తెల్గు నేర్వ!బంధంబును త్రెంచ కండి!
9.గర్భగత"-జుంటితేనె"-వృత్తము.
అభికృతిఛందము.స.జ.ర.భ.ర.జ.భ.స. ల.గణములు.యతులు.9,17.
ప్రాసనీమముగలదు.
సుమ సౌరభాల తెల్గు!ఛందో వరదాల మిన్న!జుంటి తేనె రుచికి సాటి!
సమ సామ్య మేర్చు జాతి!స్ఫందంబవధాన కీర్తి!బంటునైన ఘనుని జేయు!
గమనంబు తీర్చు నీతి!గంథంబిది!భావస్ఫూర్తి!కంటి వెల్గు శుభ వరాశి!
భ్రమలేద?తెల్గు నేర్వ!బంధంబును త్రెంచ కండి!బంధి గాకు పరుల భాష!
10.గర్భగత"-రుచికర"-వృత్తము.
అభికృతిఛందము.ర.న.జ.త.జ.భ.జ.ర. ల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
జుంటి తేనె రుచికి సాటి!ఛందోవరదాల మిన్న!సుమ సౌరభాల తెల్గు!
బంటునైన ఘనుని జేయు!స్ఫందంబవధాన కీర్తి!సమసామ్య మేర్చు జాతి!
కంటివెల్గు శుభ వరాశి!గంథంబిది భావ స్ఫూర్తి!గమనంబు తీర్చు నీతి!
బంధీగాకు పరుల భాష!బంధంబును త్రెంచకండి!భ్రమలేద?తెల్గు నేర్వ!
స్వస్తి.
జైహింద్.
1 comments:
నమస్కారములు
శ్రీ పండితులవారి కృషి అద్భుతం . శిరసాభి వందనములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.