గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, ఫిబ్రవరి 2018, శనివారం

,భారయశజా, గర్భ యశోత్పలజాద్వయ వృత్తములు. రచన:-వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి.

 జైశ్రీరామ్.
,భారయశజా, గర్భ యశోత్పలజాద్వయ వృత్తములు.
  రచన:-వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి.
  జుత్తాడ.

యశోత్త్పలజాద్వయ వృత్తములు.
ఉత్కృతిఛందము.భ.ర.న.భ.ర.య.స.జ.లల.గణములు.యతులు.10.18.
ప్రాసనీమముగలదు.
1.భారము మోయ నేరనని!భారతమాత యన్నచో! వారణసేయు వారెవరు?
  నీరము లేక సృక్కితని!నీరజనాభ!కావవే!  నీరము!నిమ్ము!  !శ్రీ లలర!
  తారక!పంట గూర్చుమన!ధారలునింపు!భూతలిన్!తా రమ!నీతినింగొలువ!
  జీరును!శాంతి భద్రతలు!క్షీరజముల్కడున్గడున్!శ్రీ రమ మేర్చి కూర్చు నిక!

2.వారణసేయు!వారెవరు?భారతమాత!యన్నచో!భారము!మోయనేరనని!
  నీరము!నిమ్ము!శ్రీలలర!నీరజనాభ!కావవే!నీరము లేక సృక్కితని?
  తా రమ నీతినింగొలువ!ధారలు నింపు!భూతలిన్!తారక!పంట!గూర్చు!మన
  శ్రీరమ మేర్చి!కూర్చునిక!క్షీరజముల్కడున్గడున్!జీరును!శాంతి భద్రతలు!

1.గర్భగత"-భరణాద్వయవృత్తములు.
బృహతీఛందము.భ.ర.న.గణములు.వృ.సం.471.ప్రాసగలదు.
1.భారము మోయ!నేరని!            2.వారణ సేయు వారెవరు?
   నీరము లేక!సృక్కితని!                నీరము!నిమ్ము!శ్రీలలర!
   తారక!పంట!గూర్చు!మన!             తా రమనీతినిం!గొలువ!
   జీరును!శాంతిభద్రతలు!                శ్రీరమ మేర్చి!కూర్చు నిక!

2.గర్భగత"-ఉత్పలాంగిర ద్వయవృత్తములు.
అత్యష్టీఛందము.భ.ర.న.భ.ర.లగ.గణములు.వృ.సం.44,499.
యతి.10.వ.యక్షరము.ప్రాసనీమము కలదు.
1.భారము మోయ నేరనని!భారత!మాత!యన్నచో!
   నీరము!లేక!సృక్కితని!నీరజనాభ!కావవే!
   తారక!పంటగూర్చు!మన!ధారలు!నింపు!భూతలిన్!
   జీరును!శాంతి  !భద్రతలు  !క్షీరజముల్కడున్గడున్!

2.వారణసేయువారరెవరు?భారతమాత!యన్నచో!
    నీరము నిమ్ము!శ్రీలలర! నీరజనాభ!కావవే!
    తా రమ!నీతినింగొలువ ! ధారలు నింపు!భూతలిన్!
    శ్రీరమ మేర్చి కూర్చు నిక!క్షీరజముల్కడుంగడున్!

3. గర్భగత"-వెన్నాడు"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.ర.య.స.జ.లల.గణములు.యతి.09.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
భారతమాత!యన్నచో! వారణ సేయు వారెవరు?
నీరజనాభ!కావవే! నీరము నిమ్ము!శ్రీలలర!
ధారలు!నింపు!భూతలిన్!తా రమ నీతినింగొలువ!
క్షీరజముల్కడుంగడున్! శ్రీరమ!మేర్చి!కూర్చు నిక!

4.గర్భగత"-రంబకా"వృత్తము.
ధృతిఛందము.భ.ర.న.భ.ర.న.గణములు.యతి10.వ.యక్షరము.ప్రాసగలదువారణ!సేయు వారెవరు?భారము!మోయ నేరనని!
నీరమునిమ్ము!శ్రీలలర!నీరములేక!సృక్కితని!
తా రమ!నీతినింగొలువ!తారక!పంట గూర్చు!మన!
శ్రీరమ మేర్చి కూర్చు నిక! జీరును!శాంతిభద్రతలు!

5గర్భగత"-ఉద్వర "-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.న.భ.ర.న.భ.ర.లగ.గణములు.యతులు10.19
ప్రాసనీమముగలదు.
వారణ!సేయు వారెవరు?భారము!మోయ నేరనని!భారతమాత!యన్నచో!
నీరము!నిమ్ము!శ్రీలలర!నీరము !లేక !సృక్కితని!   నీరజనాభ !కావవే!
తా రమ!నీతినింగొలువ!తారక!పంట!గూర్చుమన!ధారలునింపు!భూతలిన్!
శ్రీరమ!మేర్చి కూర్చునిక! జీరును!శాంతిభద్రతలు!క్షీరజముల్కడుంగడున్!

6.గర్భగత"-భారయశజా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.య.స.జ.స.స.జ.లల.గణములు.యతులు.09.18.
ప్రాసనీమముగలదు.
భారతమాత!యన్నచో!వారణ!సేయువారెవరు?భారము!మోయ!నేరనని!
నీరజనాభ!కావవే!నీరమునిమ్ము!శ్రీలలర! నీరము లేక!సృక్కితని!
ధారలు!నింపు!భూతలిన్!తా రమ!నీతినింగొలువ!తారక!పంట!గూర్చుమన!
క్షీరజముల్కడుంగడున్!శ్రీరమ!మేర్చి కూర్చు!నిక!జీరును!శాంతిభద్రతలు!
స్వస్తి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
వివిధ వృత్తములతో అలరించు చున్నవి . ధన్య వాదములు . శ్రీ చింతా సోదరులకు అభినందనలు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.