గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, ఫిబ్రవరి 2018, ఆదివారం

భావినీ,కీర్తిగామినీ, గర్భ శోధకా వృత్తము. రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
భావినీ,కీర్తిగామినీ, గర్భ శోధకా వృత్తము.    
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.

            శోధకావృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.స.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
జ్ఞానజీవి!మానవుండు!సదమలంపు!కీర్తిగామి!సాధకుండు!శోధకుండనన్!
కానరానిదేది ?లేదు!కదలుచుండు!తెల్విగల్గి!కాదనేది!లేదు!  చూడగా!
మానవత్వ బుద్ధి మెల్గు!మధుర జీవనంబు కోరి!మాదనెండు!భావభంగిమన్!
మేనబ్రాణమున్నవర్కుమెదలుచుండడు!నీతిగల్గి!మేథినిన్శుభూతిదుండునై!

1.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
జ్ఞానజీవి! మానవుండు!
కానరానిదేది లేదు!
మానవత్వబుద్ధి మెల్గు!
మేనబ్రాణమున్న వర్కు!

2.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.ప్రాసగలదు.
సదమలంపు!కీర్తి గామి!
కదులుచుండు!తెల్వి గల్గి!
మధుర జీవనంబు!కోరి!
మెదలుచుండు!నీతిగల్గి!

3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
సాధకుండు!శోధకుండనన్!
కాదనేది!లేదు!చూడగా!
మాదనెండు!భావ భంగిమన్
మేథినిం!సుభూతిదుండు!నై!

4.గర్భగత"-సాధకా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.స.జ.గల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
జ్ఞానజీవి!మానవుండు!సదమలంపు!కీర్తి గామి!
కానరానిదేది?లేదు!కదలుచుండు!తెల్వి గల్గి!
మానవత్వ బుద్ధి!మెల్గు!మథుర!జీవనంబు కోరి!
మేనబ్రాణ మున్నవర్కు!మెదలుచుండు!నీతిగల్గి!

5.గర్భగత"-నీతిగా"-వృత్తము.
ధృతిఛందము.న.ర.జ.ర.జ.ర.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సదమలంపు!కీర్తి గామి!సాధకుండు!శోధకుండనన్!
కదలుచుండు!తెల్వి గల్గి!కాదనేది!లేదు?చూడగా!
మథుర జీవనంబు కోరి!మాదనెండు!భావ భంగిమన్!
మెదలుచుండు!నీతి గల్గి!మేథినిం!సుభూతిదుండు నై!

6.గర్భగత"-జ్ఞానజీవి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.జ.ర.ర.జ.గల.వృత్తము.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
సదమలంపు!కీర్తి గామి!సాధకుండు!శోధకుండనన్! జ్ఞానజీవి!మానవుండు!
కదలుచుండు!తెల్విగల్గి!కాదనేది!లేదు?చూడగా !కానరానిదేది!  లేదు!
మథుర జీవనంబుగోరి!మాదనెండు!భావభంగిమన్!మానవత్వబుద్ధి!మెల్గు!
మెదలుచుండు!నీతిగల్గి!మేథినిం!సుభూతిదుండునై!మేనబ్రాణమున్నవర్కు!

7.గర్భగత"-రజోరంజిత"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సాధకుండు!శోధకుండనన్!జ్ఞానజీవి మానవుండు!
కాదనేదిలేదు?చూడగా! కానరాని దేది లేదు!
మాదనెండు!భావ భంగిమన్!మానవత్వ!బుద్ధి !మెల్గు!
మేథినింసు!భూతిదుండునై!మేనబ్రాణమున్నవర్కు!

8.గర్భగత"-అమలకీర్తి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.భ.స.జ.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.

సాధకుండు!శోధకుండనం!జ్ఞానజీవి!మానవుండు!సదమలంపు!కీర్తి గామి!
కాదనేది!లేదు?చూడగా!కానరానిదేది లేదు! కదలుచుండు!తెల్వి గల్గి!
మాదనెండు!భావ భంగిమం!మానవత్వ బుద్ధి!మెల్గు!మథుర జీవనంబుకోరి!
మేథినిం!సుభూతిదుండునై!మేనబ్రాణమున్నవర్కు!మెదలుచుండు!నీతిగల్గి!

9గర్భగత"-భావినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.ర.జ.గల.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు. 
సదమలంపు!కీర్తిగామి!జ్ఞానజీవి!మానవుండు!
కదలుచుండు!తెల్విగల్గి!కానరానిదేది!లేదు!
మథుర!జీవనంబుకోరి!మానవత్వ!బుద్ధిమెల్గు!
మెదలుచుండు!నీతిగల్గి!మేనబ్రాణమున్నవర్కు!

10.గర్భగత"-కీర్తిగామినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
సదమలంపు!కీర్తిగామి!జ్ఞానజీవి!మానవుండు!సాధకుండు!శోధకుండనన్!
కదలుచుండు!తెల్విగల్గి!కానరానిదేదిలేదు?కాదనేదిలేదు?చూడగా!
మథుర!జీవనంబుకోరి!మానవత్వ!బుద్ధిమెల్గు!మాదనెండు!భావభంగిమన్!
మెదలుచుండు!నీతిగల్గి!మేనబ్రాణమున్నవర్కు!మేథినిం!సుభూతిదుండునై!
 స్వస్తి.
మూర్తి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
" సమాశ్రీ " వృత్తము జ్ఞానజీవి మానవుండు .... " గతికా " వృత్తము ...సదమలంపు కీర్తి గామి ఇలా సులభశైలిలో గర్భగత వృత్తములు అలరించు చున్నవి . సరస్వతీ పుత్రులిరువురకూ శిరసాభి వందనములు


కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.