గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, ఫిబ్రవరి 2018, మంగళవారం

తమిజా,స్తుత్యతా,గర్భ"-విజయీభవ"-వృత్తము. .. .. .. శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

  జైశ్రీరామ్.
తమిజా,స్తుత్యతా,గర్భ"-విజయీభవ"-వృత్తము.
☆ఆరువేల నూతన ఛందాలు చేయనెంచి కార్యోన్ముఖునైన,నాపరిశ్రమకు
    భావితరపుటూహాగానము.☆
వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                                          
"విజయీభవ"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.జ.య.స.స.స.త.మ.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
పదులారువందలు!ఛందాల్ప్రబలున్శతకోటి!కృతుల్వాగీశ్వరీ!సంప్రోక్తమై!
విధిగా!భువిం!విలువొందున్విభవంబు!పుడమిన్వేగంబునన్భాష్యంబునౌ!
ఉదయించు!గ్రంధములెన్నో!నుభయంబగుతారకమున్నూగించు!
శోభాయంబునై!-చదలంటనాంధ్రసుకీర్తుల్సభలన్విభుతన్గనుతన్శౌగంధికాసౌరుల్గనున్!
చదలు=ఆకాశము,వినువీధి

1.గర్భగత"-సజసజ"-వృత్తము.
బృహతీఛందము.స.జ.య.గణములు.వృ.సం.108.ప్రాసగలదు.
పదలారువందలు!ఛందాల్!
విధిగా!భువిన్విలు వొందున్!
ఉదయించు!గ్రంధము లెన్నో?
చదలంట!నాంధ్ర!సుకీర్తుల్!

2.గర్భగత"-బృహతీ"-వృత్తము.
బృహతీఛందము.స.స.స.గణములు.వృ.సం.220.ప్రాసగలదు.
ప్రభలున్శతకోటి కృతుల్!
విభవంబొనరుపుడమిన్!
ఉభయంబగు!తారకమున్!
సభలం!విభుతన్గనుతన్!

3.గర్భగత"-ప్రాపక"-వృత్తము.
అనుష్టుప్ఛందము.త.మ.లగ.గణములు.వృ.సం.69.ప్రాసగలదు.
వాగీశ్వరీ!సంప్రోక్తమై!
వేగంబునన్భాష్యంబునౌ!
ఊగించు!శోభాయంబునై!
సౌగంధికా!సౌరుల్గనున్!

4.గర్భగత"-సజ్జయా"-వృత్తము.
ధృతిఛందము .స.జ.య.స.స.స.గణములు.యతి10.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
పదులారువందలు!ఛందాల్ప్రభలున్శతకోటికృతుల్!
విధిగా!భువిన్విలువొందున్విభవంబొనరున్!పుడమిన్!
ఉదయించు!గ్రంధములెన్నో?ఉభయంబగు!తారకమున్!
చదలంట!నాంధ్రసుకీర్తుల్సభలం!విభుతన్గనుతన్!

5.గర్భగత"-సత్తమా"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.స.త.మ.లగ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ప్రభలున్శతకోటి!కృతుల్వాగీశ్వరీ!సంప్రోక్తమై!
విభవంబొనరున్భువిలోన్వేగంబునన్భాష్యంబునై!
ఉభయంబగు!తారకమున్నూగించు!శోభాయంబునై!
సభలన్విభుతన్గనుతన్!సౌగంధికా!సౌరుల్గనున్!

6.గర్భగత"-తన్మజా"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.మ.జ.జ.భ.త.త.జ.లగ.గణములు.యతులు.09,18.
ప్రాసనీమముగలదు
వాగీశ్వరీ!సంప్రోక్తమై!పదులారువందలు!ఛందాల్ప్రభలున్శతకోటికృతుల్!
వేగంబునన్భష్యంబునై!విధిగా!భువిన్విలువొందున్విభవంబొనరన్భువిలోన్!
ఊగించుశోభాయంబునై!ఉదయించు గ్రంధములెన్నో!ఉభయంబగు
తారకమున్!
సౌగంధికాసౌరుల్గనున్చదలంట!నాంధ్రసుకీర్తుల్సభలన్విభుతన్గనుతన్!

7.గర్భగత"-సత్ప్రభా"-వృత్తము.
ధృతిఛందవము.స.స.స.స.జ.య.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ప్రభలున్శతకోటికృతుల్!పదులారువందలు ఛందాల్!
విభవంబొనరుపుడమిన్!!విధిగా భువిన్విలువొందున్!
ఉభయంబగు!తారకమున్!ఉదయించుగ్రంధములెన్నో?
సభలంవిభుతన్గనుతన్!చదలంట!నాంధ్ర సుకీర్తుల్!

8.గర్భగత"-సాత్విజ"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.స.స.జ.య.త.మ.లగ.గణములు.యతులు.10.19.
ప్రాసనీమముగలదు.
ప్రభలున్శతకోటికృతుల్పదులారువందలుఛందాల్వాగీశ్వరీ!సంప్రోక్తమై!
విభవంబొనరుంపుడమిం!విధిగాభువింవిలువొందు!వేగంబునంభాష్యంబునై
ఉభయంబగు!తారకమౌ!ఉదయించు!గ్రంధములెన్నో?యూగించు    శోభాయంబునై
.సభలంవిభుతంగనుతం!చదలంటనాంధ్రసుకీర్తుల్సౌగంధికా!సౌరుల్గనన్!

9.గర్భగత"-తమిజా"-వృత్తము.
అత్యష్టీఛందము.త.మ.జ.జ.జ.లగ.గణములు.యతి09.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
వాగీశ్వరీ!సంప్రోక్తమౌ!ప్రభలున్శతకోటి కృతుల్!
వేగంబునం!భాష్యంబునౌ!విధిగా!భువిన్విలువొందు!
ఊగించు!శోభాయంబునై!ఉదయించు!గ్రంధములెన్నో?
సౌగంధికాసౌరుల్గనం!చదలంటు!నాంధ్ర!సుకీర్తుల్!

10.గర్భగత"-స్తుత్యతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.మ.జ.జ.జ.జ.జ.భ.గగ.గణములు.యతులు.09.18.
ప్రాసనీమముగలదు.
వాగీశ్వరీ!సంప్రోక్తమౌప్రభలున్శతకోటికృతుల్!పదులారువందలు!ఛందాల్
వేగంబునం!భాష్యంబునౌ!విధిగాభువిన్విలువొందువిభవంబొనరున్పుడమిన్
ఊగించు!శోభాయంబునై!ఉదయించుగ్రంధములెన్నో!ఉభయంబగు
తారకమున్!
సౌగంధికాసౌరుల్గనం!చదలంటు!నాంధ్రసుకీర్తుల్!సభలంవిభుతం!గనుతన్!

స్వస్తి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ వల్లభవఝులవారి గర్భగత వృత్తములు అలరించు చున్నవి .ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.