జైశ్రీరామ్.
రజనీకరప్రియ,నింగినంటు,శృంగభంగ,గర్భ నిరుపమా వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
నిరుపమావృత్తము.
ఉత్కృతిఛందము.ర,జ,ర,న,ర,ర,జ,ర,లగ.గణములు.యతులు.10.18.
ప్రాసనీమముగలదు.
నేలవీడి సామదేలనో?నిరుపమంబె?నీశక్తి!నింగినంటు ప్రాణవాయువుల్!
మేలుగాని యోచనంబులం!మెరిగితంచుయోచింపపమ్రింగనౌను!దోష
భూషలున్!
చాలినంత సేవభావముం!సరగుమయ్య సామ్యాన!జంగమాల!భూతి దీర్చుచున్!
చీలిపోనికీర్తినందుమా!చెరుపనెంచ పాపంబు!శృంగభంగటూహవీడుమా!
నింగినంటుప్రాణవాయువుల్=ప్రాణములుపోవును.మెరిగిితిమెరిగిపోతిని.
సామమ్యసమసమానత్వాన.శృంగభంగ=అవమానకరపు.చీలిపోని=విడి
పోవని .చాలినంత=సరిపడినంత!
గర్భగత"-మత్తరజినీద్వయవృత్తములు.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
1.నేలవీడి సామదేలనో? 2.నింగినంటు ప్రాణవాయువుల్!
మేలుగాని యోచనంబులన్! మ్రింగనౌను దోషభూషలున్!
చాలినంత సేవభావమున్! జంగమాల భూతిదీర్చుచున్!
చీలిపోని కీర్తి నందుమా! శృంగభంగ టూహ వీడుమా!
2.గర్భగత"-నేనెందు"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.ర.గల.గణములు.వృ.సం.152.ప్రాసగలదు.
నిరుపమంబె?నీశక్తి!
మెరిగితంచు యోచింప!
సరగుమయ్య సామ్యాన!
చెరప నెంచ పాపంబు!
3.గర్భగత"-తగుసేవా"-వృత్తము."
అత్యష్టీఛందము.ర.జ.ర.న.ర.గల.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నేలవీడి సామదేలనో? నిరుపమంబె?నీశక్తి!
మేలుగాని యోచనంబులం!మెరిగితంచు!యోచింప!
చాలినంత సేవభావముం!సరగుమయ్య!సామ్యాన!
చీలిపోని!కీర్తినందుమా!చెరప నెంచ పాపంబు!
4.గర్భగత"-నిరాధార"-ద్వయవృత్తములు.
అత్యష్టీఛందము.న.ర.ర.జ.ర.లగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
1.నిరుపమంబె?నీశక్తి! నింగినంటు!ప్రాణవాయువుల్!
మెరిగి'తంచు!యోచింప!మ్రింగనౌను?దోషభూషలున్!
సరగుమయ్య!సామ్యాన!జంగమాల!భూతి దీర్చుచున్!
చెరప నెంచ!పాపంబు! శృంగభంగ!టూహ వీడుమా!
2.నిరుపమంబె?నీశక్తి! నేలవీడి సామదేలనో?
"మెరిగితంచు"!యోచింప!మేలుగాని!యోచనంబులన్!
సరగుమయ్య!సామ్యాన !చాలినంత!సేవభావమున్!
చెరప నెంచ!పాపంబు !చీలిపోని!కీర్తి నందుమా!
5.గర్భగత"-దోషభూష"-వృత్తము
ఉత్కృతిఛందము.న.ర.ర.జ.ర.య.జ.ర.లగ.గగణములుయతులు.9.18.
ప్రాసనీమముగలదు.
నిరుపమంబె?నీశక్తి!నింగినంటు!ప్రాణవాయువుల్నేలవీడ!సామదేలనో?
"మెరిగితంచుయోచింప!మ్రింగనౌను?దోషభూషలుం!మేలుగాని!
యోచనంబులన్!
సరగుమయ్య!సామ్యాన!జంగమాలభూతిదీర్చుచుం!చాలినంత!సేవభావమున్!
చెరపనెంచ!పాపంబు!శృంగభంగటూహవీడుమా!చీలిపోని!కీర్తినందుమా!
6.గర్భగత"-రజినీకరప్రియ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నింగినంటు!ప్రాణవాయువుల్నేలవీడీ సామదేలనో?
మ్రింగనౌను?దోషభూషలుంమేలుగానియోచనంబులన్!
జంగమాల!భూతిదీర్చుచుం!చాలినంత!సేవభావమున్!
శృంగభంగ!టూహవీడుమా!చీలిపోని!కీర్తినందుమా!
7.గర్భగత"-నింగినంటు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.న.ర.గల.గణమువు.యతులు.10.19.
ప్రాసనీమముగలదు.
నింగినంటు!ప్రాణవాయువుల్నేలవీడి సామదేలనో?నిరుపమంబె?నీశక్తి!
మ్రింగనౌను దోషభూషలుం!మేలుగానియోచనంబులం!మెరిగితంచు!
యోచింప!
జంగమాల!భూతిదీర్చుచుం!చాలినంత సేవభావముం!సరగుమయ్య!
సామ్యాన!
శృంగభంగటూహ!వీడుమా!చీలిపోని కీర్తినందుమా!చెరుపనెంచ!పాపంబు!
8.గర్భగత"-శృంగభంగ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.ర.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
నిరుపమంబె?నీశక్తి!నేలవీడి సామదేలనో?నింగినంటు!ప్రాణవాయువుల్!
మెరిగితంచుయోచింప!మేలుగాని!యోచనంబులం!మ్రింగనౌను?దోష
భూషలున్!
సరగుమయ్య!సామ్యానచాలినంత!సేవభావముం!జంగముల!భూతి
దీర్చుచున్!
చెరుపనెంచ పాపంబు!చీలిపోని!కీర్తినందుమా!శృంగభంగటూహవీడుమా!
స్వస్తి.
మూర్తి. జుత్తాడ.ప
జైహింద్.
1 comments:
నమస్కారములు
నేలవీడి సామదేలనో , మేలుగాని యోచనంబులన్ . చాలా బాగుంది. ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.