జైశ్రీరామ్.
శ్లో. వివేకినో విరక్తస్య శమాదిగుణశాలినః
ముముక్షోరేవ హి బ్రహ్మజిజ్ఞాసాయోగ్యతా మతా.( వివేకచూడామణి ౨. శంకరాచార్యులు.)
గీ. విశ్వమందువిరక్త వివేకులు, మరి
శమదమాది సద్గుణులును, శాంతిమతులు,
మోక్షకాములు మాత్రమే ముక్తిఁగోర
నర్హులరయఁగ యితరులనర్హులరయ.
భావము:. వివేకి, విరక్తుడు, శమం మొదలైన గుణాలు కలవాడు, మోక్షాన్ని కోరుకునేవాడు మాత్రమే బ్రహ్మజిజ్ఞాసకు అర్హుడు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
బాగుంది . నిజంగా మనసంస్కృతి మేలిమి బంగారమే. చక్కగా వివరించారు.ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.