జైశ్రీరామ్
యూహనా,వాగ్ఝరీ,పారావార,గర్భ ధారయామసి వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి.
జుత్తాడ.
ధారయామసివృత్తము.
ఉత్కృతిఛందము.జ.మ.త.ర.ర.య.మ.య.ల గ.గణములు
.యతుల10,19.ప్రాసనీమముగలదు.
అపారపారావారాంబోధి!యావతుం!పాత్ర నింపెడూహం!యాలోచింపగా!వాగ్ఝరిన్
కృపారసార్ధుండా!శంభుండు!కేవలుండే ర్చుఛందరాజిన్!కేలుందాల్చిరా!
వాక్సతీ!
తాపంబుదీర్పన్కావ్యంబేర్చు!తావకం బౌనటుల్గనంగా!తాళంజాల!నింకెంతయో !
శ్రీపాదసంపత్కావ్యాశ్రింజేర్చు! శ్రీవరంబేర్చుగా!శుభాలం!శ్రీలంధా రయా మసియై!
1.గర్భగత"-అనాధరక్షా"-వృత్తము
బృహతీఛందము.జ.ర.త.గణములు.వృ.సం. 278.ప్రాసగలదు.
అపారపారావారాంబోధి!
కృపారసార్ధుండా!శంభుండు!
తాపంబు!దీర్పన్కావ్యంబేర్చు!
సంపత్కావ్యాశ్రంజేర్చంజేర్చు!
2.గర్భగత"-రారయ"-వృత్తము.
బృహతీఛందము.ర.ర.య.గణములు.వృ.సం. 83.ప్రాసగలదు.
యావతుంపాత్రనింపె డూహన్!
కేవలుండేర్చు!ఛందరాజిన్!
తావకంబౌ ! నటుల్గ నంగగా!
శ్రీవరంబేర్చుగా!శుభాలన్!
3.గర్భగత"-మూలాధార"-వృత్తము.
అనుష్టప్ఛందము.మ.య.లగ.గణములు.వృ .సం.73.ప్రాసగలదు.
యాలోచింపగా!వాగ్ఝరిన్!
కేలుందాల్చి రా!వాక్సతీ!
తాళంజాల!నింకెంతయో!
శ్రీలం!ధారయామసి! యై!
4.గర్భగత"-పావోదధి"-వృత్తము.
ధృతిఛందము.జ.ర.త.ర.ర.య.గణములు.య తి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
అపార!పారావారాంబోధి!యేవతుం!పాత్ ర నింపెడూహన్!
కృపారసార్ధుండా!శంభుండు!కేవలుండే ర్చు!ఛందరాజిన్!
తాపంబు!దీర్పన్కావ్యంబేర్చు!తావ కంబౌనటుల్గనంగా!
శ్రీపాదసంపత్కావ్యాశ్రింజేర్చుం శ్రీవరంబేర్చుగా!శుభాలన్!
5.గర్భగత"-శ్రీవరంబేర్చు"-వృత్త ము.
అత్యష్టీఛందము.ర.ర.య.మ.య.లగ.గణము లు.యతి.10.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
యావతున్పాత్ర నింపెడూహన్నాలోచింగా!వాగ్ఝరిన్!
కేవలుండేర్చు!ఛంద రాజిన్! కేలుందాల్చిరా!వాక్సతీ!
తావకంబౌనటుల్గనంగా! తాళంజాల!నింకెంతయో?
శ్రీవరంబేర్చుగా!శుభాలం!శ్రిలంధా రయయామసి!యై
6.గర్భగత"-కైవల్యదా"-వృత్తము.
అత్యష్టీఛందము.మ.య.జ.ర.మ.గల.గణము లు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఆలోచింపగా!వాగ్ఝరిన్అపారపాపరా వారాంబోధి!
కేలుందాల్చి!రా వాక్సతీ!కృపా!రసార్ధుండా!శంభుండు !
తాళంజాల!నింకెంతయో!తాపంబు!దీర్పం !కావ్యంబేర్చు!
శ్రీవరంబేర్చుగా!శుభాలం!శ్రీపాద !సంపత్కావ్యాశ్రిన్జేర్చు!
7.గర్భగత"-కృపారస"-వృత్తము.
ధృతిఛందము.ర.ర.య.జ.ర.త.గణములు.య తి.10.వ.యక్షరము
ప్రాసనీమముగలదు.
యావత్పాత్ర!నింపెడూహం!అపారపారావా రాంబోధి!
కేవలుండేర్చు!ఛందరాజిన్!కృపారసా ర్ధుండా!శంభుండు!
తావకంబౌనింకెంతయో! తాపంబుదీర్పన్! కావ్యంబేర్చు!
శ్రీవరంబేర్చుగా!శుభాలన్!శ్రీసం ప్కపత్కావ్యాశ్రింజేర్చు!
8.గర్భగత"-యూహనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.ర.య.మ.య.జ.ర.మ.గ ల.గణములు
.యతులు.10,18.ప్రాసనీమముగలదు.
యావతున్పాత్రనింపెడూహం!యాలోచింప గా!వాగ్ఝరిన్నపారవారాంబోధి!
కేవలుండేర్చుఛందరాజిన్!కేలుందాల్ చిరా!వాక్సతీ!కృపారసార్ధుండా!
శంభుండు!
తావకంబౌనటుల్గనంగా!తాళంజాల!నింకెం తయో!తాపంబు!దీర్పన్కావ్యం
బేర్చు!
శ్రీవరంబేర్చుగా!శుభాలం!శ్రీలంధా రయామసి!యై!శ్రీసంపత్కావ్యాశ్రిం జేర్చు!
9.గర్భగత"-వాగ్ఝరీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.య.జ.ర.మ.ర.య.జ.గ గ.గణములు.
యతులు.9.18.ప్రాసనీమముగలదు.
యాలోచింపగావాగ్ఝరింయపారపారావారాంబోధియావతుంపాత్రనింపె
డూహన్!
కేలుందాల్చిరా!వాక్సతీ!కృపారసార్ ధుండా!శంభుడు!కేవలుండేర్చు!ఛందరా జిన్
తాళంజాలనింకెంతయో!తాపంబుదీర్పన్ కావ్యంబేర్చుతావకంబౌనటుల్గనంగా! శ్రీలంధారయామసియైశ్రీపాదసంపత్కా వ్యాశ్రింజేర్చు! శ్రీవరంబేర్చుగా!శుభాలన్
10.గర్భగత"-పారావార"-వృత్తము..
ఉత్కృతిఛందము.ర.ర.య.జ.ర.త.మ.య.ల గ.గణములు.యతులు10,19
ప్రాసనీమముగలదు
యావతుంపాత్రనింపపెడూహన్నపారపారా వారాంబోధియాలోచింపగా!
వాగ్ఝరిన్!
కేవలుండేర్చుఛందరాజిన్!కృపారసార్ ధుండు!శంభుండు!కేలుదాల్చిరా!
వాక్సతీ!
తావకంబౌనటుల్గనంగా!తాపంబుదీర్పన్ కావ్యంబేర్చు!తాళంజాల!నింకెంతయో ?
స్వస్తి.
మూర్తి. జుత్తాడ.
జైహింద్.
1 comments:
నమస్కారములు
పాండితీ స్రష్టకు ప్రణామములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.