జైశ్రీరామ్.
మోహక,.తన్వీనీ, "గర్భ. సిరులొనరు. "వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
సిరులొనరు వృత్తము.
******************
ఉత్కృతి ఛందము. న.న.జ.స.న.న.న.న.గల.గణములు. యతులు.10,19.వ.యక్షరములు. ప్రాసనీమముగలదు.
జడముడిని నెలమొల్క! జగదాంబ! యరలొడలు! జలములజలకాలు!
జడుపొనరు!కడుబీద! జగమేలు హరుడతడు! చలనము!మరు! నేల!
చెడుతరుము!శివమూర్తి! సెగఱేడు!నుదురొదవు!జిలుగుల!వెలి మేను!
తొడవుమెడ!చదిరంబు! తొగసూడు!నెల కనులు! తొలకక!సిరులిచ్చు!
నెలమొల్క=చంద్రవంక,యరలొడలు=అర్ ధనారీశ్వరి,జడుపొనరు=
భయముకల్గు, మరునేల=స్మశానభూమి,చెడుతరుముదో షములలను
పోజేయు,శివమూర్తి=శాంతరూపుడు,సె గఱేడు=అగ్ని, నుదురొదవు=
లలాటముననొప్పను, జిలుగులవెలిమేను=ప్రకాసించెడి తెల్లనిశరీరఛాయ.
చదిరంబు=పాము.నెల=చంద్రుడు.
1,గర్భగత "-త్రినేత్త్ర."-వృత్తము.
బృహతీఛందము.న.న.జ.గణములు.వృ.సం. 384.ప్రాసగలదు.
జడముడిని నెలమొల్క
జడుపొనరు కడుబీద
చెడు తరుము!శివమూర్తి
తొడవుమెడ!చదిరంబు!
2.గర్భగత"-సననా"-వృత్తము.
బృహతీఛందము.స.న.న.గణములు.వృ.సం. 508.ప్రాసగలదు.
జగదాంబ!యరలొడలు!
జగమేలు!హరుడతడు!
సెగఱేడు!నుదురొదవు!
తొగసూడు!నెల కనులు !
3.గర్భగత"-మృదుపద"-వృత్తము
అనుష్టుప్ఛందము.న.న.గల.గణములు. వృ.సం.192.ప్రాసగలదు.
జలముల!జలకాలు!
చలనము!మరునేల!
జిలుగుల!వెలిమేను!
తొలకక!సిరులిచ్చు!
4.గర్భగత"-మాతాశ్రీ"-వృత్తము.
ధృతిఛందము..న.న.జ.స.న.న.గణములు. యతి10వ.అక్షరము.
ప్రాసనీమముగలదు.
జడముడి!నెలమొల్క!జగదాంబ!యరలొడలు !
జడుపొనరు!కడుబీద!జగమేలు!హరుడతడు !
చెడుతరుము!శివమూర్తి!
జైహింద్.
2 comments:
గురుదేవులకు వినమ్రవందనములు
మంచి గర్భ గతమైన పద్యాలు వ్రాసిన శ్రీమాన్ వల్లభఝల వారకి పాదాభివందనములు..
నమస్కారములు
గర్భగత ' త్రినేత" , సననా, మృదుపద , నాతశ్రీ వృత్తములు సులభముగా నున్నవి . పైన అర్ధమును చదివిన తదుపరి శ్రీ వల్లభవఝులవారి సిరులొన వృత్తము తెలిసినది. ధన్య వాదములు .శ్రీ చింతా సోదరులకు అందించినందులకు అభినందనలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.