గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, జనవరి 2018, మంగళవారం

మోహక,.తన్వీనీ, "గర్భ. సిరులొనరు. "వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

  జైశ్రీరామ్.
మోహక,.తన్వీనీ, "గర్భ. సిరులొనరు. "వృత్తము.
 రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
   జుత్తాడ.
  
                సిరులొనరు వృత్తము.
                 ******************
ఉత్కృతి ఛందము. న.న.జ.స.న.న.న.న.గల.గణములు.                              యతులు.10,19.వ.యక్షరములు. ప్రాసనీమముగలదు.
జడముడిని నెలమొల్క! జగదాంబ! యరలొడలు! జలములజలకాలు!
జడుపొనరు!కడుబీద! జగమేలు హరుడతడు! చలనము!మరు! నేల!
చెడుతరుము!శివమూర్తి! సెగఱేడు!నుదురొదవు!జిలుగుల!వెలిమేను!
తొడవుమెడ!చదిరంబు! తొగసూడు!నెల కనులు! తొలకక!సిరులిచ్చు!

నెలమొల్క=చంద్రవంక,యరలొడలు=అర్ధనారీశ్వరి,జడుపొనరు=
భయముకల్గు, మరునేల=స్మశానభూమి,చెడుతరుముదోషములలను
పోజేయు,శివమూర్తి=శాంతరూపుడు,సెగఱేడు=అగ్ని, నుదురొదవు=
లలాటముననొప్పను,  జిలుగులవెలిమేను=ప్రకాసించెడితెల్లనిశరీరఛాయ.
చదిరంబు=పాము.నెల=చంద్రుడు.

1,గర్భగత "-త్రినేత్త్ర."-వృత్తము.
బృహతీఛందము.న.న.జ.గణములు.వృ.సం.384.ప్రాసగలదు.
జడముడిని నెలమొల్క
జడుపొనరు కడుబీద
చెడు తరుము!శివమూర్తి
తొడవుమెడ!చదిరంబు!

2.గర్భగత"-సననా"-వృత్తము.
బృహతీఛందము.స.న.న.గణములు.వృ.సం.508.ప్రాసగలదు.
జగదాంబ!యరలొడలు!
జగమేలు!హరుడతడు!
సెగఱేడు!నుదురొదవు!
తొగసూడు!నెల కనులు !

3.గర్భగత"-మృదుపద"-వృత్తము
అనుష్టుప్ఛందము.న.న.గల.గణములు.వృ.సం.192.ప్రాసగలదు.
 జలముల!జలకాలు!
చలనము!మరునేల!
జిలుగుల!వెలిమేను!
తొలకక!సిరులిచ్చు!

4.గర్భగత"-మాతాశ్రీ"-వృత్తము.
ధృతిఛందము..న.న.జ.స.న.న.గణములు.యతి10వ.అక్షరము.
ప్రాసనీమముగలదు.
జడముడి!నెలమొల్క!జగదాంబ!యరలొడలు!
జడుపొనరు!కడుబీద!జగమేలు!హరుడతడు!


చెడుతరుము!శివమూర్తి!
జైహింద్.
Print this post

2 comments:

Unknown చెప్పారు...

గురుదేవులకు వినమ్రవందనములు
మంచి గర్భ గతమైన పద్యాలు వ్రాసిన శ్రీమాన్ వల్లభఝల వారకి పాదాభివందనములు..

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
గర్భగత ' త్రినేత" , సననా, మృదుపద , నాతశ్రీ వృత్తములు సులభముగా నున్నవి . పైన అర్ధమును చదివిన తదుపరి శ్రీ వల్లభవఝులవారి సిరులొన వృత్తము తెలిసినది. ధన్య వాదములు .శ్రీ చింతా సోదరులకు అందించినందులకు అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.