జైశ్రీరామ్.
శ్లో. యాచకో లఘుతాం యాతి | సద్య:శీల గుణాన్విత:శ్రీపతి ర్వామనో భూత్వా | యాచతే స్మ బలిం పురా.
క. యాచన చులకన చేయును.
యాచనచే వామనుఁడయె హరి బలి యెదుటన్.
యాచనఁ గుణములు మాయును.
యాచించని బ్రతుకు బ్రతుకు.హరినే మించున్.
భావము. ఎంత గుణవంతుడైతేనేమి, యాచించే సరికి తేలిక అయిపోతాడు. సాక్షాత్తు లక్ష్మీ దేవికి మగడై ఉండి కూడా, విష్ణువు రాక్షస రాజైన బలి ముందు వామను(మరిగుజ్జు)డై పోయాడు కదా..
జైహింద్.
1 comments:
నమస్కారములు
నిజమే ధనమునకున్న గొప్పతన మటువంటిది
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.