జైశ్రీరామ్.
7వ పద్యపక్షము
మాదక ద్రవ్యాల మత్తులో యువత - నాశనమవుతున్న భవిత.
రచన. చింతా రామ కృష్ణా రావు
౧. అటవెలది త్రయ గర్భ సీసము.
శ్రీనివాసుఁడవని చిక్కుంచుకొన
నిన్ను -
చేయి పట్టి తరికి చేఁదుకొనవొ?
మానవాళి మరిగె మాదక
ద్రవ్యముల్ - భవిత భ్రష్టమవదె?
పాహి కృష్ణ!
అతిప్రమాదకరము లగును
మాదకద్రవ్య - ములవి మరిగి ప్రాణములకు ముప్పు
తెచ్చుకొనుచునున్న వచ్చునెవ్వఁడు
కావ, -
మాన్పి కావుమఖిల మాన్య
కృష్ణ!
ఆ.వె. పెద్దవారు
పలుకు సుద్దులు వినఁజాల - రిట్టి మాదకములనెఱిఁగిరేని.
పిన్నవారి భవిత పీకుకుపోవును
-
జాగు వలదు.కావ జాలు కృష్ణ! ౧.
౨. అటవెలది త్రయ గర్భ సీసము.
నీతి నెఱుఁగ నేర్పి
భాతిని పెంచినన్ బాలురెపుడు నేర్వజాలరిట్టి
మత్తు కలుగఁ జేయు మాదక
ద్రవ్యముల్ గొనుట.
నేర్పునటుల కనుము కృష్ణ!
మంచి చెడులనెన్న మరతురు
మత్తులో భవిత శూన్యమగుట భువిని కనరు.
మత్తుమందు మరిగి చిత్తగుచున్నట్టి
వారి మదులు మార్చవేర?
కృష్ణ!
ఆ.వె. తల్లిదండ్రులపయి
దయన్నదే వీడు, తనను తాను కనడు గుణము చెడును.
మరిగిరేని జనులు మాదక
ద్రవ్యముల్ మరుగకుండ సుగతి మనుపు కృష్ణ!
౩. అటవెలది త్రయ గర్భ సీసము.
చదువు సంధ్యలు విడు సద్భావనలు వీడు సుగతి వీడు తనదు
ప్రగతి వీడు
వీడ జాలక తను వాడు మాదకద్రవ్య
ములను. కావుమతని
పూజ్య కృష్ణ!
చేయ రాని పనులు చేయఁబూను యువత, ప్రాయముడుగునాడు పనికి రారు.
జ్ఞేయములను నేర్చి శ్రేయంబు
గనుమార్గ గాములవగఁ జేసి కాచు కృష్ణ!
ఆ.వె. తల్లిదండ్రులెపుడు తమ పిల్లలను కని పొంగఁ జూతురుకద? ముదిమి కదిసి
మూల్గుచున్న తరిని పోషింపఁదగు
సంతు మత్తు వీడి కనఁగ మలచు కృష్ణ!
చం. భవితకు మూలమౌ యువత బానిసలైనను
మత్తుమందుకున్
భువినిక కల్గునెవ్వరు
ప్రపూజ్య మహాద్భుత భావి గొల్పగా?
సవరణ చేయగావలెను చట్టములన్, భువి మత్తు మందులిం
కెవరును తీసుకో వెరవనెంతటి
దండననైన వేయుచున్.
మ. ధనసంపాదనకై దురాత్ములిల సంస్థాపించి
రీద్రవ్యముల్
జనులెల్లం గొననమ్ముచుండిరకటా! జాఢ్యంబుగా మారెనే
డినవంశోత్తమునైనమార్చ
గలిగే యా మాదకద్రవ్యముల్
గొనకుండన్, నశియించకుండ మనగా కూర్మిన్
జనుల్ కోరెదన్.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.