జైశ్రీరామ్.
11వ పద్యపక్షము
టీవీ
సీరియళ్ళు - సమాజంపై ప్రభావం.
రచన. చింతా రామ కృష్ణా రావు.
౧. ఆటవెలది త్రయ గర్భ సీసము.
శ్రీపతి కనిపించు చేతనత్వముఁగొల్పు
-
రమ్మని పిలిచేమొ రారు
జనులు.
దూరదర్శనమున దూరిపోదురు
వారు -
కాంచు కాంక్ష వలన, కనుము కృష్ణ!
బుల్లితెరను వచ్చు పుంఖానుపుంఖాల
-
నాటక క్రమదృష్టి నాట
మదిని
చేటు కలుఁగఁ జేయు చిత్ర
దర్శనమబ్బె. -
మానవాళిఁ గనుమ మనిచి, కృష్ణ!
ఆ.వె. చూచువారి
మదికి సూదంటురాయియే - దూరదర్శన మనివారణమయె.
ధనముచేసుకొనెడి మనమె
కానఁగవచ్చు. -
ప్రబలె దీని మహిమ. పాపు కృష్ణ!
౨. ఆటవెలది త్రయ గర్భ సీసము.
సమయ పాలనమున సాక్షులై
కనిపించు - బుధులు చూడ మరిగి విధులు మరచి
దూరదర్శనమున సారించి
మనమును -
దూరుదురయ దానిఁ గోరి
కృష్ణ!
దూరదర్శన క్రమ భూరి
దుర్గతి నాడు - వారు కూడ విడువఁ గోరు మగల
నాడువారి మనసులాకట్టుకొనునవి. - చెడ్డమార్పు లొసగుఁ జేటు కృష్ణ!
ఆ.వె. మంచియు
చెడు నుండు మన దూరదర్శినిన్ - సమయపాలనమది జరుగనీదు.
కాలగతిని మరచి కాంచుటన్
వికటించి - జీవితములు సమసిపోవు కృష్ణ!
౩. ఆటవెలది త్రయ గర్భ సీసము.
దూర దర్శనమున
దురితంబులే చేయు - టీ వ్యవస్థ
మరగు పృథ్వి పైన.
విలువలన్ విడుతురు
విగత నైతికముల - వీక్షణమునఁ జేసి వినుత కృష్ణ!
విలువలెంచని మది నలముకొనదె
యుదా -
సీనత? మనకింక చెడుటె మిగులు.
ఇహ పరములపైన నేరీతిగా
కల్గు -
రిక్త జీవుల కనురక్తి? కృష్ణ!
ఆ.వె. ధర్మదూరులగుచు
తరియింప లేక జ్ఞే - యము నిలం దెలియక యలమటింత్రు.
అంతులేని కథల ననురక్తిఁ
గనుచు, క్రు
-
ళ్ళుచు, కృశింతురు కలఁగుచును కృష్ణ!
౪. శా. కర్మంబియ్యది దూరదర్శనగతుల్ కాలుష్యసంపూర్ణముల్.
మర్మాతీతగుణాతిరిక్త
కథలన్ మంత్రించు దృశ్యాళిచే
నైర్మల్యంబగు మానవాళి
కలఁగున్ నారీజనోత్ప్రేరణన్
దుర్మార్గంబగు చిత్ప్రవృత్తి, కలుగున్ దుస్తంత్ర దుర్మార్గముల్..
౫. ఉ. కాలమునాహరించు
కలికాలపు ధర్మమనంగ పెచ్చు, స
చ్చీలములన్ హరించు, వివశీకృతులౌనటు చేయునెల్లరన్.
గోలగనావరించు, గుణకోవిదునైనను మార్చు నద్దిరా!
యేలికలున్ గ్రహింపరె
యహీన దురంతపు దూరదర్శనిన్.
స్వస్తి.
జైహింద్.
2 comments:
నమస్కారములు
పిల్లలు చెడి పోవడానికీ , అత్తాకోడళ్ళ నడుమ లేనిపోని తెలియనివెన్నో నేర్చుకోవడానికీ ఈ సీరియల్సు ఎక్కువగా ఉపయోగ పడుతున్నా యని పిస్తుంది. ఇక దంపతుల మధ్య ఎటు దారితీస్తాయో ఊహా తీతమె . ఇక ఈ యుగానికి మార్పు రాదేమొ .
గురుదేవులకు వినమ్రవందనములు
మంచి చెడూ కలిగిన సీరియళ్ళు జూచి చెడిపోయిన వారే ఎక్కువ..
చాలా మంచి పద్యములతో వివరించిన మీకు ధన్యవాదములు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.