గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, మే 2017, శనివారం

ద్వితీయ పద్యపక్షమ్.ప్రకటన.

 జైశ్రీరామ్.
ఆర్యులరా! ద్వితీయ పద్యపక్షమ్ అద్వితీయ్ంగా ప్రకటింపఁబడింది. ఇంకెందుకు ఆలస్యం? కనీసం ఒక వృత్తపద్యంతో కలిపి ఐదుపద్యాల పరిమితిలో "జీవనాధార జలవనరుల సద్వినియోగం" అనే అంశంపై వ్రాసి
కు మెయిల్ చెయ్యండి.
ఇంతకు ముందు ఇచ్చిన నియమ నిబంధనలను చూడండి.
పద్యాభిమానులకు నమస్కారం !
కవులూ,కవయిత్రులూ అందరూ సానుకూలంగా స్పందించి సహకరించాలని కోరుతున్నాము.
ఇప్పటి వరకూ స్పందించని సభ్యులను కూడా తమ విలువైన వ్రాతలతో సమాజాన్ని చైతన్య పరచాలని వేడుకుoటున్నాము.
@@@@@నియమ నిబంధనలు@@@@@@
1.పద్య పక్షం శీర్షిక క్రింద ప్రతి పక్షానికి ఒక సామాజికాoశం సూచించబడుతుంది. గడువు ఆ పక్షం రోజులు (ఆంగ్ల తేదీల ప్రకారం 15 రోజులు) ఉంటుంది.
2.ఇచ్చిన అంశం మీద కవులూ, కవయిత్రులూ ఛందో,వ్యాకరణ విధేయంగా నాలుగు పాదాలు కల 5 పద్యాలు వ్రాయాలి. అందులో తప్పక ఒక వృత్త పద్యం ఉండాలి. పద్యమాలికలు ,ద్విపదలు మొదలగునవి పూర్తిగా నిషిద్ధం
3..గతంలో ఒక సీసం రెండు పద్యాలకు సమానం అన్న నిబంధన పెట్టాము..ఈసారి అలాంటిది లేదు.ఎత్తుగీతితో కలిపి ఒక సీసం ఒక సీసమే!!ఏదైనా విశేష వృత్తాలు వ్రాసినప్పుడు,వాటి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించి , అవి లక్షణ గ్రంథాల్లో చెప్పబడిన విధంగానే ఉండి,ఆ గ్రంథాల ఉటంకింపుతో సహా ,గణ,యతి మైత్రులను స్పష్టంగా సూచించడం తప్పనిసరి.
4.ప్రతి పక్షం మూడు రచనలను ప్రథమ ,ద్వితీయ,తృతీయ,స్థానాల వారీగా ఎంపిక చేస్తాము. గరిష్టంగా ఒకే కవి/కవయిత్రి రచనలు రెండు పక్షాలకు మాత్రమే ఎన్నికవుతాయి. అయితే ఈ వివరాలన్నీ అక్టోబరు 15 తరువాతనే వెల్లడి చేస్తాము.అంతవరకూ కొంచెం ఓపిక పట్టి సహకరించాల్సిందే!
5.పద్యాలు గతంలో ఏ రూపంలోనూ అంతర్జాలంలో పోస్టింగుతో సహా ప్రచురణ,ప్రసారం అయ్యి ఉండగూడదు.అవి తప్పనిసరిగా పాల్గొన్న వారి స్వంత రచనలే అయ్యి ఉండాలి. స్కాను చేసి పోస్టు చేసిన రచనలు పరిశీలించబడవు.అదే విధంగా PDF రూపంలో పంపరాదని మనవి.ఒక వేళ PDF గా పంపితే ,అదే మేల్ లో తప్పని సరిగా MS WORD లోకూడా పంపండి.మాకు ఫైల్ చేయడానికి సులువుగా ఉంటుంది.
6.ఒకరు ఒక పక్షానికి ఇవ్వబడిన సామాజిక అంశం మీద ఒక్క రచన మాత్రమే పంపాలి.పద్య పక్షం –సామాజిక రచనోద్యమం ,prajapadyam@gmail.com కు మాత్రమే పోస్టు చేయాలి. పక్షం రోజుల తరువాత ఒక్కసారి అందరి పద్యాలు ఒక పోస్ట్ లో పెట్టబడును. అందరూ చూసి,కామెంటులు వ్రాయవచ్చును..లైకు చేయవచ్చును .ఏమీ అభ్యంతరం లేదు.నిజానికి అందరూ చూడాలన్నదే మా ఉద్దేశ్యం.పోస్టు చేసిన వారు ఆ పక్షం గడువు ముగిసాక కావాలనుకుంటే ఎడిటింగ్ గానీ తప్పుల సవరణగానీ చేయవచ్చు. లేదా తమ స్వంత వాల్ మీద మాత్రం పోస్టు చేసుకోవచ్చును.
7.ఒక పక్షంలో వచ్చిన రచనలన్నీ సవరణకు ఆస్కారం లేని విధంగా ప్రస్తుతానికి బ్లాగులో/ప్రత్యేక పోస్ట్ లోనో పెట్టబడతాయి.న్యాయ నిర్ణేతలు ఈ బ్లాగు/ప్రత్యేక పోస్ట్ ఆధారంగానే పరిశీలన,మూల్యాoకనం చేస్తారు.ముగ్గురు న్యాయ నిర్ణేతలు ఉంటారు.వారు వేసిన మార్కుల సగటు ఆధారంగానే ప్రథమ,ద్వితీయ,తృతీయ స్థానాల ఎంపిక జరుగుతుంది,ప్రజ-పద్యం ఎడ్మిన్స్ తో సహా ఈ న్యాయ నిర్ణేతలు సౌలభ్యాన్ని బట్టి ఎవరైనా కావచ్చు..వీరి నిర్ణయమే అంతిమం.
8. అన్నీ అనుకూలిస్తే ఎంపిక చేసిన రచనలనన్నీ పుస్తక రూపంగా ముద్రించే ప్రయత్నంలో ఉన్నాం.. కార్తీక మాసం వనభోజనoలో మళ్ళీ మనం ఒక ప్రజ-పద్యం ఆత్మీయ సభతో కలుస్తున్నాం.
9.రచనలను మూల భావం చెడకుండా ,సవరణ/పరిష్కరణ చేసే అధికారం ఈ గ్రూపుకు ఉన్నది.అవసరానుగుణంగా నియమ, నిబంధనలు మార్చడానికి, సడలించడానికి గ్రూపు వారికి అన్ని హక్కులూ ఉంటాయి..ఈ ఉద్యమoలో పాల్గొన్న కవులూ,కవయిత్రులూ మా అన్ని నియమ నిబంధనలను ఆమోదించినట్టుగానే భావిస్తాము.ఏ విషయం మీదైనా గ్రూపు నిర్వాహకులదే సర్వాధికారం. ఏ విధమైన వాద వివాదాలకు ఎలాంటి ఆస్కారం లేదు.
పచ్చని పద్యాన్ని ప్రేమిద్దాం!!!
ఇక వ్రాసి పంపే పని పూర్తి చెయ్యగలరని ఆశించుచున్నాను.
ఈ పక్షం వ్రాయవలసిన వివరాలు చూడండి.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.