జైశ్రీరామ్.
ఆర్యులారా! తెలుగు తల్లి మన కల్పవల్లి. అట్టి తల్లి కడుపున పుట్టుట ఒక యోగము. అట్టి మంచి తల్లికి బిడ్డనైనందుకు గర్విస్తున్నాను. ఆంధ్రమాత కడుపారఁ గన్న ముద్దుబిడ్డలామె కీర్తి పతాకను దశదిశలా ఎగురవేస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. చూడండి మన తల్లి కడుపునపుట్టిన కవిపండితులు ఆతల్లిని, కవితామతల్లిని శిరములఁ దాల్చి ఆమె మహనీయ సంస్కృతినప్రతిహతముగా చాటుచూ ఎదురొచ్చినవారిని కుదిపి క్రింద పడేస్తున్నారు.
ఎవడో వదరుబోతు తెలుగు పద్యాన్ని పాతెస్తానన్నాడంతే.
చూడండి మన అవధానావతంసులైన శ్రీ కడిమిళ్ళ వరప్రసాద్ గారు మహదాగ్రహోదగ్రులై ఎలా హుంకరించారో !చూడండి.
డా.కడిమిళ్ళ వరప్రసాద్.
అంతే కాదు మన తెలుగు భాష మాధుర్యమునెంత చక్కగా ఆటవెలదిగా మనకందించారో చూడండి.
ఆ.వె. మల్లెపూవులోని మకరంద బిందువు
గుమ్మపాలలోని కమ్మదనము
వెన్నముద్దలోని వింత మెత్తదనమ్ము
కలసినట్టి భాష తెలుగు భాష.
అంతే కాదు. మాతృ భాషా మాధుర్యమును తెలుగు తీపితనమును, అమ్మలోని అమృతత్వమును తేనెలొలుక తేట గీతిలో ఎంతబాగా చెప్పారో చూడండి.
మాతృభాషకంటె మాధుర్యమే లేదు
తెలుగు భాషకంటె తీపి లేదు
అమ్మ! యనుట కంటె అమృతమ్ము లేదయా
తెలిసికొనుమ! తెలుగు నిలుపుకొనుమ!
ఇంతటి ఆత్మాభిమాన, భాషాభిమాన, దేశాభిమాన పూర్ణులయిన శ్రీ కడిమెళ్ళవారికి, వారి తనయుఁడు చిరంజీవి విరించికి అభినందనలందఁజేయుచున్నాను.
ఇంతటి ఆత్మాభిమాన, భాషాభిమాన, దేశాభిమాన పూర్ణులయిన శ్రీ కడిమెళ్ళవారికి, వారి తనయుఁడు చిరంజీవి విరించికి అభినందనలందఁజేయుచున్నాను.
జైహింద్.
6 comments:
అయ్య బాబోయ్ అండీ ! నేను గాదండీ !
జిలేబి
అమ్మా! నమస్తే. ఆగ్రహోదగ్రమైన పద్య రచన చేసినది గరిమెళ్ళవారు కాదమ్మా. కడిమెళ్ళవారు.నమస్తే.
అయ్యయ్యో! నేను మీరేమో అనుకొని భయపడ్డానండి జిలేబీగారూ!
ఏదో మీ దయ మా ప్రాప్తమండీ ఆంధ్రామృతం వారూ ! కుశలమా !
జిలేబి
ఆంధ్రామృతాన్ని గ్రోలుతూ మనసునూరించే జిలేబీ ఉండగా కుశలమునకేమిలోటుంటుందండి జిలేబీగారూ!
నమస్కారములు
పొరబడి నందులకు క్షమించ గలరు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.