గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జనవరి 2016, మంగళవారం

జాతీయ యువజన దినోత్సవము

జైశ్రీరామ్. 
భారతీయ యువజనులారా! మీ అందరికీ నా శుభాకాంక్షకు.
మీరు శ్రీ స్వామీ వివేకానందునికి వారసులు. 
మీకు లభించిన వారసత్వ సంపదను కాపాడుకోండి.
వివేకానందుని జీవిత చరిత్ర చదవండి. 
చికాగోలో చేసిన అతని ఉఅపన్యాసాన్ని ఆకళింపు చేసుకోండి.
మీరు కూడా అత్యంత ఆదరణీయమైన భారతీయ యువకులుగా గుర్తింపు తెచ్చుకోండి.
మీరు చేయదలిస్తే మీకు తిరుగు లేదు. మీలో నిండి ఉంది అనంతమైన శక్తి.
ఆ శక్తితో మీరు మన తల్లి భారతమాత కీర్తి దశ దిశలా వ్యాపింపచెయ్యండి. ప్రపంచపటంలో భారత దేశం అత్యంత శక్తివంతమైన దేశం అనేలా చేయటం మీవల్లనే సాధ్యమౌతుందని మరువకండి.
మీ శక్తి సామర్ధ్యాలను అనవసర కార్యకలాపాలకు వెచ్చించకండి.
నాకు తెలుసు.వివేకానందుని నిజమైన వారసులుగా మీరు కీర్తి సంపాదించగలరని. 
మీకు మరొక్కమారు నా అభినందనలు. మీకు ఆ పరమాత్మ నిత్యం తోడుగా ఉండాలని మనసారా కోరుకొంటున్నాను.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును యువతరం తల్చు కుంటే సాధించ లేనిది ఏదీలేదు. తప్పక విజయం పొంద గలరని ఆశీర్వదిస్తు .అక్క + అమ్మ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.