గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, జనవరి 2016, సోమవారం

తెలుగు భాష . . . డా.కడిమెళ్ళ వర ప్రసాద్ శతావధాని.

జైశ్రీరామ్.
డా.కడిమెళ్ళ వర ప్రసాద్ శతావధాని.
ఆ.వె. మల్లెపూవులోని మకరంద బిందువు
గుమ్మపాలలోని కమ్మదనము
వెన్నముద్దలోని వింత మెత్తదనమ్ము
కలసినట్టి భాష తెలుగు భాష. 

మాతృభాషకంటె మాధుర్యమే లేదు
తెలుగు భాషకంటె తీపి లేదు
అమ్మ! యనుట కంటె అమృతమ్ము లేదయా
తెలిసికొనుమ! తెలుగు నిలుపుకొనుమ!
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవధాని గారికి అభినందనలు .మన తెలుగు భాషను గురించి ఎంత వర్ణించినా కొంత మిగులుతూనే ఉంటుంది . చక్కగా వర్ణించారు. బాగుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.