గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, జనవరి 2016, శుక్రవారం

చూడగ మీ సరి మీరలే కదా! . . . మకర సంక్రాంతి శుభాకంక్షలు.

జైశ్రీరామ్.
ఆర్యులారా! ఈ రోజు మకర సంక్రాంతి పర్వదినము. మీ అందరికీ నా శుభాకాంక్షలు.
శుభములనంత శోభలను చూపుత మీ గృహమందు నిల్చి, మీ
కభయదుడౌత శ్రీహరి ప్రకాశముఁ గొల్పుత మీ హృదిన్ సదా!
విభవముతోడ వర్ధిలుఁడు, విశ్వ విజేతగ గుర్తు పొందుచున్,
శుభగుణ శోభితుల్ తమరు. చూడగ మీ సరి మీరలే కదా!
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మిత్రు లందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.