గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, జనవరి 2016, బుధవారం

తెలుగు భాషామతల్లి ముద్దుబిడ్డ, సహస్ర పద్య కంఠీరవ శ్రీ చిక్కా రామదాసు ప్రతిభ..

జైశ్రీరామ్.
ఆర్యులారా! ఈ క్రింది చిత్రములోనున్నది సహస్ర పద్య కంఠీరవ బిరుదాంకితులైన శ్రీ చిక్కా రామదాసు.
వీరు ఒక సామాన్యమైన బట్టల వ్యాపారి. ఆ తెలుగుతల్లి ఏమి పుణ్యం చేసుకుందో కాని ఆతల్లి కీర్తిని దశ దిసలా వ్యాపింపఁ జేయఁ బూనినారు మన చిక్కా రామదాసు గారు. అతనికి ఆజ్ఞాపక శక్తి ఏవిధంగా కలిగిందోకాని, సహస్రాధిక తెలుగు పద్యములను అనర్గళముగా సభలో ఏక కంఠంతో రాగ యుక్తంగా చదివి శ్రోతలనలరింప జేయ గలిగిన దిట్ట వీరు.ుందటి సంవత్సరం తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభలు వీరు ఆలపించిన ప్రార్థనా గీతంతోనే ప్రారంభం జరిగిందీ అంటే వీరి ప్రాశస్త్యం ఎంతటిదో మనకర్థమౌతుంది.
తెలుగు సాహిత్య కళా పీఠం 2011 లో ప్రారంభించి నిరాఘాటంగా ప్రతీ సంవత్సరమూ అనేక సాహితీ కార్యకెఅమాలతో తెలుగు భాషా సంసేవనా తత్పరత కనబరుస్తూనే ఉన్నారు.
సహస్ర పద్య కంఠీరవ శ్రీ చిక్కా రామదాసు.
ప్రథమ వార్షికోత్సవమునకనేకులు దిగ్దంతులు సభనలంకరించి, తెలుగు భాషాభిమానాన్ని చాటి చెప్పారంటే ఆ కృషు మరెవరిదో కాదు. మన చిక్కావారిదే.
అందుకే శ్రీ చిక్కా రామదాసుకు అక్కునేని నాగేశ్వరరావుగారు సత్కారం.చేసి గౌరవించారు.
ఈ నాడు పెక్కుండ్రు తెలుగు కవితాభిలాషులై, గద్య, పద్య, గేయ, రచనలు చేసే సాహసం చేస్తున్నారంటే అది మన చిక్కావారి కృషిఫలితమే అని చెప్పక తప్పదు.

ప్రపంచ తెలుగు నహా సభలలో మన రామదాసుగారు తన బృందంతో కలిసి ముఖ్య భూమిక వహించారు.
ఎక్కడ చూచినా చిక్కావారే. ఎవరి నోట విన్నా రామదాసే. 
చూచారా! బ్రతుకు తెఱువుకు ఏవృత్తి చేపట్టితే ఏమిటి? సాహితీ ప్రియత్వం వారిని మహోన్నత వ్యక్తిగా తెలుగు సమాజంలో చెసింది. నిరంతరం ఏదో ఒకటి చేయాలనే తపన, భాషా సేవ ఎంత చేస్తున్నా తనివి చెందని అభిలాష.
వీరిని గూర్చి ప్రశంసిస్తూ వ్రాయని దినపత్రిక లేదు.
వీరు కవితానురక్తులను ప్రోత్సహించి సత్కరిస్తూ తన ఔన్నత్యాన్ని చాటుకుంటుంటారు. వీరు ఉభయ కవి మిత్రులు. 
పద్య-గేయ కవులకు,
ఆంధ్ర-తెలంగాణ కవులకు మిత్రులై ఉభయ కవిమిత్రులనే బిరుదు వహింపఁ జాలినవారు.
వీరి కృషిని మనసారా అభినందిస్తూ, చిత్ర, బంధ, గర్భ కవితాభిలాషినైన నన్ను కూడా వీరు సముచిత సత్కారాలతో గౌరవిస్తున్నందుకు మనసారా కృతజ్ఞతలు తెలియఁ జేసుకొంటున్నాను. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పూజనీయులకు ప్రణామములు
సహస్ర పద్య కంఠీరవ శ్రీ చిక్కా రామదాసు మహనీయులకు శిరసాభి శత వందనములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.