గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, డిసెంబర్ 2015, గురువారం

శ్రీమాన్ దీక్షితుల సుబ్రహ్మణ్యమ్. స్త్రీ గాత్రంతో సంప్రదాయ కీర్తనలు. .

జైశ్రీరామ్.
ఆర్యులారా! ఆ పరమాత్మ సృష్టిలో అతని కృపకు పాత్రులయే ధన్య జీవులు చాలా అరుదుగా ఉంటారు. అట్టి వారిలోమహబూబ్ నగర్ కు చెందిన శ్రీ దీక్షితుల సుబ్రహ్మణ్యం గారు అతి ప్రముఖులుగా మనం భావించ వచ్చును. అతి చిన్న వయసులోనే ప్రపంచ ప్రఖ్యాతినార్జించిన అతి తక్కువమందిలో వీరొకరు. ఈ పురుష పుంగవునకు స్త్రీగాత్రం దేవుఁడిచ్చిన వరము. శ్రీమతి సుశీల్, లీల, శోభారాణి మున్నగువారెవరికీ తీసిపోని గాత్రమాధుర్యంతో సభాసదులను సమ్మోహితులను చేస్తారు. వీరికి అనతి కాలంలోనే వరించిన బిరుదులు చూస్తే మీకే తెలుస్తుంది వీరి సామర్ధ్యము. చూడండి వీరిని గూర్చిన వివరాలు. వినండి వీరి గాత్రామృత గానాన్ని.
 

వీరు మనిండ్లలో జరిగే శుభకార్యములలో కచేరీ చేసి మంత్రముగ్ధులను చేయ సమర్ధులు. అవసరమయినప్పుడు మనము వీరి సహకారాన్ని తప్పక తీసుకొనే సదవకాశం మనకు భగవంతుఁడు కల్పించటం మన అదృష్టమే.
వీరి చిఱునామా, దూరవాణి సంఖ్య పైన గల వివరాలలో లభ్యమగును.
నమస్తే. 
జైహింద్.
Print this post

2 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఇది శ్రీమాన్ అర్క సోమయాజివారి వ్యాఖ్య.

అద్భుతం సార్.
Arka Somayaji
December 3 at 8:32am

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అందరి మన్ననలను అందుకున్న అద్భుత మైన మధుర గానం . అభినందన మందారములు . శ్రీ చింతావారికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.