గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, డిసెంబర్ 2015, గురువారం

శ్రీ గణేశాష్టకమ్. . . . డా.మాడుగుల అనిల్ కుమార్. కృతికి నా ఆంధ్రానువాదము

జైశ్రీరామ్.
డా.మాడుగుల అనిల్ కుమార్
       గీ. పార్వతీమాత చేసిన, భవ్యమైన
       నిఘ్ననాయకుఁడనఁబడు విగ్రహంబు
       కమల సన్నిభ ముఖమున కాంతినొప్పె.
       అట్టి గణనాథు మ్రొక్కెద ననుపమ గతి. 
       భావము.

       గీ. అన్ని విఘ్నంబులనుబాపి, యసదృశమగు
       శుభములిచ్చెడి దైవమా! అభయమీయ
       నన్ని కార్యంబులకు ముందు నిన్నె కొలుతు
       రందరును. నేను నిన్ ముందె కొలుతు.
       భావము.
       క. గజ ముఖము, బాన పొట్టయు,
       ప్రజలను కాచేటి బుద్ధి వర్ధిలఁ జేయన్
       నిజమగు కోర్కెలు మంచివి
       భుజముననిడు కొనుచు తీర్చు పూజ్యుఁడ! కొలుతున్. 
       భావము.
       క. శిరసున రత్న కిరీటము 
       మురిపెంబుఁగ నొప్పఁ దాల్చు, పూజ్యుననంతున్,
       సరిలేని రాక్షసాంతకు 
       వరగణపతి దేవు నేను ప్రార్థింతు మదిన్.
       భావము.
       క. పాశాంకుశ దంతంబుల
       నాశగ నస్త్రముగ దాల్చి, యలరెడు వానిన్,
       కాశ సుపూజిత నిర్మల
       దీశక్తిద పాదపద్మ దీపితుఁ గొలుతున్.
       భావము
       క. సిద్ధిని, బుద్దిని సతులుఁగ
       పద్ధతిగా కలిగి, కోరు భక్తుల కోర్కెల్
       సిద్ధింపఁ జేయు గణపతి
       నిద్ధాత్రింగొలుతు భక్తినెన్నుచు మదిలో.
       భావము.
       క. చూపులతో శ్రీకృష్ణుని
       కాపాడననుగ్రహించి, ఘనుఁడవయితివే!
       ప్రాపుగ నినుఁ గొనఁ గొలుతును.
       శ్రీ పాదుఁడ! శరణమయ్య! శ్రీ గణపయ్యా! 
       భావము.
       క. వేదవ్యాసుఁడు చెప్పిన
       బోధామృత భారతంబు పూజ్యుఁడ! మది స
       మ్మోదముతో వ్రాసితివయ!
       నీ దయ నాపయిని చూపు నిన్నే కొలుతున్.
       భావము.
       క. గణనాథాష్టక పఠనము
       వినశింపఁగఁజేయునశుభవితతిని. కోర్కెల్
       మనమునఁగలయవి తీర్చును.
       ఘన శత్రు వినాశ రిష్టి. గౌరవప్రదమున్..
       భావము.
        క. అనిల కుమారుఁడు మాడ్గుల 
        గణనాథుని యష్టకంబు గౌరవ మొప్పన్
        విన సంస్కృతమున వ్రాయఁగ
        తెనిగించితినయ! గణపతి దేవుని కృపచే..
జైహింద్.
Print this post

5 comments:

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

శ్రీ గణేభ్యో నమః ...బాగుందండీ...

సో మా ర్క చెప్పారు...

అద్భుతం రామకృష్ణ కవీంద్రా!

మక్కికి మక్కిగ తెలగున
ఒక్కొక పద మింపుసొంపు నొప్పెడు గతి నిం
చక్కని శైలిని మీదౌ
చిక్కని భావమ్ములమర జేసితిరికవీ!

డా.మాడుగుల అనిల్ కుమార్ చెప్పారు...

🙏🙏🙏 నమస్కారములు. అద్భుతమైన పద్యానువాదం.

ధన్యవాదాలు ఆర్యా! - డాక్టర్ మాడుగుల అనిల్ కుమార్ శర్మ

డా.మాడుగుల అనిల్ కుమార్ చెప్పారు...

🙏🙏🙏💐💐💐 నమస్కారాలు. అద్భుతమైన పద్యానువాదం. ధన్యవాదాలు ఆర్యా!

డా.మాడుగుల అనిల్ కుమార్ చెప్పారు...

💐💐💐🙏🙏🙏 నమస్కారములు. అద్భుతమైన పద్యానువాదం. ధన్యవాదాలు ఆర్యా!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.