జైశ్రీరామ్.
శ్లో. బాలార్కో ప్రేతధూమశ్చ , వృద్ధా స్త్రీ పల్వలోదకమ్ ,రాత్రౌ దధ్యన్నభుక్తిశ్చ , ఆయుఃక్షీణం దినే దినే .
గీ. ఉదయరశ్మి, కాటిపొగయు, నొప్పు తప్పి
వలచు వృద్ధురాల్ పొందును, పడియనీరు.
రాత్రి దధ్యన్న భుక్తము ప్రముదమగునె
దినదినంబున కాయువు తీయుచుండ?
భావము. ఉదయపు టెండ , కాటి పొగ , వృద్ధస్త్రీ పొందు , పడియ ( నీరు నిలచిన చిన్నగుంట )లోని నీరు త్రాగడము, రాత్రులందు పెరుగుతో భోజనము - ఇవన్నీ ఆయువును క్షీణింపఁజేయును .
జైహింద్.
1 comments:
నమస్కారములు
చాలా మంచి శ్లోకం . బాగుంది
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.