జైశ్రీరామ్
శ్లో. గజాననం భూత గణాధి సేవితమ్ - కపిత్థ జంబూ ఫల సార భక్షితమ్
ఉమా సుతం శోక వినాశ కారణమ్న - మామి విఘ్నేశ్వర పాద పంకజమ్.
క. గజ వక్త్రు, పార్వతీసుతు,
విజయదు, జంబూ కపిత్థ ప్రియ ఫల ఖాదిన్,
భజియించి వాని పదములు
నిజమనముననిలిపి చేతు నేర్పున ప్రణతుల్.
ప్రతి పదార్ధం: గజ ఆననమ్ = ఏనుగు ముఖముకలవానిని; భూత గణాధిసేవితమ్ = భూత గణములచేత బాగుగా సేవించబడువానిని; కపిత్థ = వెలగ; జంబూ = నేరేడు; ఫల = పళ్ళు యొక్క; సార = గుజ్జును; భక్షిమ్ = తినువానిని; ఉమాసుతమ్ = పార్వతీ మాత యొక్క పుత్రుని; శోక = దుఃఖము యొక్క; వినాశ = నాశనమునకు; కారణమ్ = కారణమైన వానిని; విఘ్నేశ్వర = విఘ్నములకు అధిపతియైన వినాయకుని యొక్క; పాద పంకజమ్ = పాదపద్మములకు, నమామి = నమస్కరింతును.
భావము: గజ ముఖుడు, భూత గణములచే సేవించ బడే వాడు, వెలగ మరియు రేగు పండ్ల గుజ్జును భక్షించు వాడు, పార్వతీ పుత్రుడు, దుఃఖ వినాశ కారకుడు అయిన విఘ్నేశ్వరుని పాద పద్మములకు నమస్కరించుచున్నాను.
ఆర్యులారా! సమస్త కార్యారంభములందు ఆది పూజ్యుఁడైన శ్రీ మహా గణాధిప చతుర్థి పర్వదినము సందర్భముగా సకల చరాచర జగత్తుకు శుభమునాకాంక్షిస్తూ,
మీకు నా మనః పూర్వక శుభాకాంక్షలను తెలియఁ జేసుకొంటున్నాను.
జైహింద్.
2 comments:
నమస్కారములు
వినాయక చవితి శుభా కాంక్షలు
నాసిస్టం సరిగా లేనందున విలువైన ఛందస్సును మిస్స్ అవుతున్నాను
జంబూ అంటే రేగు కాదు - నేరేడు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.