జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి. మనము ఉపాధ్యాయ దినోత్సవము చేసుకొనే రోజు యిది.
ఈ సందర్భంగా మహనీయులైన ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చే విధంగా తత్పరత్వంతో తమ విధి నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు నా శుభాభినందనలు.
ఈ క్రింది గురు స్తోత్రము గురువుయొక్క మహనీయమైన బాధ్యతను తెలియజేయుచున్నది. ఈ మహనీయతను తమకు తాము ఆపాదింపచేసుకోడానికి గురువులందరూ హృదయపూర్వకంగా ప్రయత్నించితీరాలి. అట్టి ప్రయత్నం దీక్షా దక్షత లేనివారు ఈ వృత్తిని విడిచిపెట్టుటయే మంచిది. వృత్తికి మాత్రము అన్యాన్యాయము చేయరాదు.
శ్రీ గురుస్తోత్రం
అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం |తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవేనమః || 1
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా |
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవేనమః || 2
గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుదేవ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః || 3
స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవేనమః || 4
చిన్మయం వ్యాపి యత్సర్వం త్రైలోక్యం సచరాచరం |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవేనమః || 5
సర్వశ్రుతి శిరోరత్న విరాజిత పదాంబుజః |
వేదాంతాంబు జ సూర్యోయః తస్మై శ్రీ గురవేనమః || 6
చైతన్యః శాశ్వతః శాంతో వ్యోమాతీతో నిరంజనః |
బిందునాదకలాతీతః తస్మై శ్రీ గురవేనమః || 7
జ్ఞానశక్తి సమారూఢః తత్త్వమాలావిభూషితః |
భుక్తి ముక్తి ప్రదాతా చ తస్మై శ్రీ గురవేనమః || 8
అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధవిదాహినే |
ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవేనమః || 9
శొషణం భవసింధోశ్చ జ్ఞాపనం సారసంపదః |
గురోః పాదోదకం సమ్యక్ తస్మై శ్రీ గురవేనమః || 10
న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |
తత్త్వ జ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవేనమః || 11
మన్నాథః శ్రీ జగన్నాథః మద్గురుః శ్రీ జగద్గురుః |
మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవేనమః || 12
గురురాది రనాదిశ్చ గురుః పరమదైవతం |
గురోః పరతరం నాస్తి తస్మై శ్రీ గురవేనమః || 13
త్వమేవ మాతాచ పితా త్వమేవ | త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ |
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ | త్వమేవ సర్వం మమ దేవదేవ || 14
జైహింద్.
1 comments:
నమస్కారములు
గురుస్తుతి చాలా బాగుంది
పూజ్య గురువుల పాదారవిందములకు హృదయపూర్వక శిరసాభి శత వందనములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.