జైశ్రీరామ్
మంత్రము. ఓం భద్రం కర్ణేభిః శృణు యామ దేవాః భద్రం పశ్యేమా క్ష్యభి ర్యజత్రాః స్థిరై రంగై స్తుష్టువాగ్ఒస స్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః
గీ. శుభములే కర్ణముల విన్చు శోభిలుదుము.
శుభములే కన్నులన్ గాంచు చున్నడతుము.
బలము సంపద నారోగ్య ఫలములంది
యజ్ఞములదేవతతిఁగొల్తుమనవరతము!
భావము. ఓ దేవతలారా! మా చెవులతో శుభమైన దానినే వినెదముగాక !
ఓ పూజనీయులారా ! మా నేత్రములతో శుభప్రదమగు దానినే దర్శించెదము గాక !
మిమ్ములను స్తుతించుచు మా కొసంగబడిన ఆయుష్కాలమును సంపూర్ణ ఆరోగ్యముతో, శక్తితో జీవించెదముగాక!
మంత్రము. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః
స్వస్తి న స్తార్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు.
ఓం శాంతిః శాంతిః శాంతిః
గీ. ఋషి నుతేంద్రుఁడు శుభములనిచ్చుఁ గాత!.
సర్వవిత్సూసూర్యుడిచ్చుత సకల శుభము
లాపదలఁ గాచి వాయువు హాయినిడుత!
గురుఁడు కాచుత శుభములు కూర్చి మాకు.
భావము. సనాతన ఋషులచే స్తుతించబడిన ఇంద్రుడు మాకు శుభము చేకూర్చుగాక !
సర్వజ్ఞుడైన సూర్యుడు మాకు శుభమును కలుగజేయుగాక !
ఆపదలనుండి కాపాడు వాయువు మాకు శుభమును అనుగ్రహించుగాక !
మాలోని ఆధ్యాత్మిక ఐశ్వర్యమును రక్షించి కాపాడు బృహస్పతి మాకు శుభమును ప్రసాదించుగాక !
ఓం శాంతిః శాంతిః శాంతిః
జైహింద్.
1 comments:
నమస్కారములు
చాలా బాగున్నాయి అందరు పఠించ వలసిన మంచి శ్లోకములు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.