జైశ్రీరామ్.
ఆర్యులారా! ప్రదక్షిణ ప్రమార్థం గ్రహించండి.
ఆర్యులారా! ప్రదక్షిణ ప్రమార్థం గ్రహించండి.
శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ప్రదక్షిణలాచరిస్తున్న భక్త సందోహం.
ఈ చరాచర జగత్తులో చైతన్య శక్తి సర్వం నిత్యం పరిభ్రమిస్తూనే ఉంటుంది. సూర్యుని చుట్టూ అనేక గ్రహాలూ నిత్యం ప్రదక్షిణం చేస్తూ అనంత శక్తిని గ్రహిస్తున్నాయి. విశ్వాంతరాళంలొ వివిధ నక్షత్ర మండలాలు నిత్యం ప్రకాశించేవి, పరిభ్రమణ శక్తి వల్లనే! గ్రహముల చేత గ్రహించబడిన శక్తితోనే గ్రహాచర జీవులు చైతన్యవంత మవుతున్నాయి. సూర్యుని చుట్టూ చేసే ఒక ప్రదక్షిణ ఓ విధంగా శక్తిని పరిగ్రహించె 'ప్రదక్షిణ' అని చెప్పవచ్చు. విశ్వంలోని ప్రతీ అణు
వూ ప్రకృతి అనే పరమాత్మను కేంద్రీకరించుకొని - ఆయన ఇచ్చిన శక్తితోనే పరిభ్రమిస్తుంది. ప్రదక్షిణం వలన మాత్రమే గ్రహాలు సుస్థిరమైన స్థానం కల్పించుకో గలుగుతున్నాయని చెప్పవచ్చు.
ఈ విశ్వం లో జననం నుంచి మరణం వరకు ఒక ప్రదక్షిణ ఎన్నో ఆవృతాలతో జన్మలలో సంపాదించుకున్న కర్మల ఫలితాలనుఅనుభవించడమే. వాని దుష్ఫలితాలను తొలగించు కోవాలని తాపత్రయ పడడమే ప్రదక్షిణపరమార్థం!
ఆలయంలోని దైవశక్తి, విశ్వశక్తి కేంద్ర బిందువుకు ప్రతీక! ఆయన చుట్టూ ఉన్న ఆలయం విశ్వానికి సంకేతం! విశ్వంలో ప్రదక్షిణ చేయడం కుదరదు కనుక విశ్వేశ్వరుని చుట్టూ చేసే ప్రదక్షిణం విశ్వానికి చేసే ప్రదక్షిణంగా భావించ వచ్చు.
ఈ శీర్షిక ఇంకా చాలా వివరంగా ఎన్నో విశేషాలతో కూడి ఉన్నది. ఈ క్రింది లింకులో 41 నుండి 44 పేజీలలో ఉన్నది. చూడ గలరు.
http://ebooks.tirumala.org/అని శ్రీ కే.బీ.నారాయణశర్మగారు భాగస్వామ్యం చేసిన విషయంద్వారా తెలియుచున్నది.
జైహింద్.
1 comments:
నమస్కారములు
ఆ కొండల రాయుని స్వయముగా వెళ్ళి దర్శించ లేక పోయినా మీరందిచిన చిత్రములో గల జన సందోహమును గాంచి ఆనందించితిమి .ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.