గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జులై 2015, శుక్రవారం

గురుపూర్ణిమ సందర్భముగా పాఠకాళికి శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
శ్రీ గురుభ్యోనమః.
శ్రీ గురుదత్త.
ఆర్యులారా! పరమ విశిష్టమైన గురు పూర్ణిమ నేడే. సద్గురుదేవుల శుభాశీః పరంపర మీకు లభించాలని మనసారా కోరుకొంటున్నాను.
నారాయణ సమారంభామ్  -  వ్యాస శంకర మధ్యమామ్.
అస్మదాచార్య పర్యంతమ్  -  వందే గురు పరంపరామ్.
నారాయణుడాదిగ గురు
పారావారమున మధ్య వ్యాసుండును, గం
భీరవచశ్శంకరుడును,
ధారుణి నా గురులను మది తలచి నుతింతున్. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
తల్లి తండ్రి గురువు దైవము [ ఏడుగడ ]పాదపద్మములకు గురుపూర్ణిమ సందర్భముగా శిరసాభి శత వందనములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.