గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, జులై 2015, మంగళవారం

ఏకాక్షర కందము భావము.

జైశ్రీరామ్.
ఆర్యులారా!పూర్వ కవి ఒకరు వ్రాసిన  ఏకాక్షర కందమును, దాని భావమును తిలకించండి.
ఏకాక్షర కందము. 
దదదదదదదదదదదద
దద దదదదదద దదద దదదదదదదదద్
దదద దదదద దదద దద
ద దదద దదదద దదదద దదదద దదదద్.
భావము. శరణాగతులకు స్వాధీనుడవై, ఉదాసీనులైనవారియందు ఉదాసీనుడవై, పాపస్వభావులకు సంహారకర్తవై, రాక్షసాంతకుడవై, సజ్జనులను ప్రభవింపజేయువాడవై, ధర్మాధర్మానుసారకులకు ఆధారభూతుడవై, సత్స్వభావులను కాపాడి ముక్తినొసగువాడవై, సత్స్వభావులను బాధించువారికి బాధకుడవై, సజ్జనరక్షకులకు రక్షకుడవై, జగత్తుయొక్క బహిరంతరాలలో వసించు వాసుదేవుడవైన పరమపురుషా! శరణు! శరణు!
bhaskara ramam g
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఒక్క " ద " అక్షరములో ఇంతభావమును నింపి వ్రాసిన కవి పుంగవులకు ప్రణామములు .మాకందించిన శ్రీ చింతావారు ధన్యులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.