జైశ్రీరామ్.
శ్లో. యోజనానాం సహస్రే ద్వై ద్వైశతే ద్వై చ యోజనేఏకేన నిమిషార్థేన క్రమమాణ నమోస్తుతే. (సాయణా చార్యులు)
ఆ.వె. అర్థ నిమిషమందు నల రెండు వేలును
రెండు వందలు మరి రెండు యోజ
నములు గమన వేగ మమరిన రవి తేజ!
భవ్య వేగ! నీకు వందనములు.
భావము. అర్థ నిమేషమునందు 2202 యోజనముల మార్గమును ప్రయాణించు ఓ ప్రకాశమా నీకు నమస్కారము.
1 యోజన – 9 మైళ్ళ 160 గజాలు అనగా 9.11 మైళ్ళు
1 పగలు రాత్రి – 8,20,000 అర్థనిమిషములు
అనగా ఒక సెకనుకు – 9.41 అర్థనిమిషములు
ఈ విధముగా మనము లెక్ఖించినచో ప్రతి అర్థనిముషానికి 2202 x 9.11 = 20,060.22 మైళ్ళు
అటులనే ప్రతి సెకనుకు 20,060 x 9.41 = 1,88,766.67 మైళ్ళు .
1889 లో కాంతివేగాన్ని ప్రతి సెకనుకు1,87,327.5 మైళ్ళుగా మైకెన్సన్ ప్రకటించాడు.
సాయనాచార్యుల గణనకు ఇది సుమారుగా సరిపోతుంది.
జైహింద్.
2 comments:
ఆసక్తికరం. థాంక్యూ - శరత్
నమస్కారములు
కాంతి వేగాన్ని గురించి చక్కని వివరణ నిచ్చారు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.