జైశ్రీరామ్.
శ్లో. యస్మాచ్చ యేన చ యదా చ యథా చ యచ్చయావచ్చ యత్ర చ శుభాశుభ మాత్మకర్మ,
తస్మాచ్చ తేన చ తదా చ తథా చ తచ్చ,
తావచ్చ తత్ర చ కృతాంతవశా దుపైతి. (మహాభారతం)
క. చేసెడి పుణ్యము పాపము
చేసిన కొలదిగనె మనలఁ జేరును ఫలమై.
వాసిగ యనుభవమగునది.
ధ్యాస కలిగి సుచరితముల తనిసిన శుభమౌన్.
భావం. పుణ్య పాప కృత్యములను ఎందువలన, దేనిచేత, ఎప్పుడు, ఎట్లు, ఎంతవరకు, ఎచ్చట ఆచరిస్తున్నాడో దానికి అనుగుణంగానే ఆ యా కర్మల ఫలాలను అందువలన, అప్పుడు, అట్లు, అంతవరకు, అక్కడ విధినిర్దేశంగా అనుభవిస్తూనే ఉంటున్నాడు.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.