జైశ్రీరామ్.
శ్లో. సముద్ర మదనే లాభే హరిర్లక్ష్మీం హరో విషం
భాగ్యం ఫలతి సర్వత్ర న విద్యా న చ పౌరుషం.
ఆ. జలధి మథన వేళ జనియించి వరలక్ష్మి
హరిని చేరె, విషము హరుని చేరె.
భాగ్యఫలమె దక్కు. పౌరుష, విద్యలు
పనికిరావు భాగ్య ఫలము ముందు.
భావము. సముద్రమును మథించినప్పుడు విష్ణువు లక్ష్మిని పొందాడు, శివుడు విషాన్ని పొందాడు. కాబట్టి ఎక్కడైనా అదృష్టమే ఫలిస్తోంది, విద్య కాని పౌరుషం కాని కాదు.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.