జైశ్రీరామ్.
శ్లో. రాజ్ఞ ధర్మిణి ధర్మిష్టా పాపే పాప నరాః సదారాజానమనువర్తన్తే యధారాజా తధా ప్రజాః
గీ. ప్రభువు మంచిగ నొప్పిన ప్రజలునటులె,
ప్రభువు చెడ్డవాఁడైనచో ప్రజలునటులె.
ప్రభువు యెటులుండు నటులనే ప్రజలునుంద్రు.
ప్రభువు మంచిగ వర్తించి వరల వలయు.
భావము. ప్రజలు ఎల్లప్పుడూపాలకుని మనస్సునే అనుసరింతురు. రాజు ధర్మవంతుడైనచో ప్రజలు ధర్మ ప్రవర్తకులై యుందురు. రాజు పాప ప్రవర్తకుఁడైనచో ప్రజలు కూడా పాప ప్రవర్తకులుగనే యుందురు రాజెటు లుండునో ప్రజలూ అటులనే యుందురు.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.