జైశ్రీరామ్.
శ్లో. పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం,తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవామ్.
గీ. మనసు రమియింప చేసెడి, మనసు నెఱిగి
మెలగి, నన్ దరియింపఁ జేయు, కులము నిలుపు
పుత్రునొసగెడి భార్యను బ్రోవ నన్ను
నాకొసంగుమ దుర్గాంబ! సాకుము నను.
భావము. ఓ దుర్గామాతా! నా మనస్సును రమింపఁ జేయునట్టిదియు, నా మనసుననుసరించి వ్యవహరించునట్టిదియును, నన్ను తరింప జేయునట్టిదియును, సంసార సాగరమునుండి నన్ను తరింపఁ జేయ సమర్ధుఁడైన కులోద్ధారకుఁడైన పుత్రునొసంగునట్టిదియును అగు భార్యను నాకు ప్రసాదించుము.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.