జైశ్రీరామ్.
శ్లో. నరస్యాభరణం రూపం ,రూపస్యాభరణం గుణఃగుణస్యాభరణం జ్ఞానం , జ్ఞానస్యాభరణం క్షమా.
గీ. మనుజునకు రూపమే యాభరణము తలప.
గుణమె రూపంబునకునాభరణము కనగ.
గుణమునకుజ్ఞానమే యాభరణము తెలియ.
క్షమయె యాభరణంబు సు జ్ఞానమునకు.
భావము. మానవునకు రూపమే ఆభరణం.ఆ రూపానికి గుణం ఆభరణం. గుణానికి జ్ఞానమే ఆభరణం .జ్ఞానానికి క్షమాశీలం ఆభరణం.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.