జైశ్రీరామ్.
శ్లో. దరిద్రాయ కృతం దానం, శూన్యలింగస్య పూజనం,అనాథ ప్రేత సంస్కారం, అశ్వమేధసమం విదుః .
గీ. పేదకొసగెడి దానము ప్రీతి కరము.
శూన్య లింగార్చనంబు సన్మాన్యమతము.
దిక్కు లేని శవదహన మెక్కుడిలను.
అశ్వ మేధసుఫలదములరసి చూడ.
భావము. బీదవానికి దానం చేయటం, పాడుపడిన గుడిలోని లింగమును పూజించుట, దిక్కులేని శవమును దహనము చేయడము, యీ మూడున్ను అశ్వమేధముతో సమమైన ఫలమునిస్తాయి .
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.