గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, అక్టోబర్ 2014, శుక్రవారం

ఆంధ్రామృత పాఠకులకు యావత్ సజ్జనావళికి విజయ దశమి శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
ఆర్యులారా! చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు ఈ విజయ దశమి ఉత్సవము. మీరు నిరంతరము మంచినే ఆశ్రయిస్తూ చెడుపై విజయం సాధిస్తూ ఉండాలని, సంతోషంగా జీవితం గడపాలని మనసారా కోరుకొంటున్నాను.    ఈ సందర్భంగా మీకు, ఆంధ్రామృత పాఠకులకు యావత్ సజ్జనావళికి విజయ దశమి శుభాకాంక్షలు.
పరమదాయామృతాస్పద. కృపాసుధ వర్షిణి, శంభురాణి  స
చ్చరణములంటి మ్రొక్కెదను, చక్కగ మిమ్మిల కావుమంచు,  స
ద్వరము లొసంగుమంచు వరదాయినియై నిరతంబు నిల్చుచున్,
పరమ విశేష సద్గుణము వర్ధిలఁజేయుమటంచు నిత్యమున్.
జై జగన్మాతా! 
జైహింద్.
Print this post

2 comments:

కంది శంకరయ్య చెప్పారు...

చింతావారూ,
మీకూ, మీ కుటుంబసభ్యులకు, మీ బ్లాగు అభిమానులకు దసరా శుభాకాంక్షలు!

KRRAO చెప్పారు...

భాగవతోత్తములు అయిన మీ వంటి వారితో స్నేహము, సత్సంగము నా పూర్వజన్మ పుణ్యఫలం. మీకు, మీ కుటుంబమునకు మనఃపూర్వక విజయదశమి శుభాకాంక్షలు.
మీతోటి స్నేహము చిరకాలము వాంచిస్తూ...
మీ భాస్కరానందనాథ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.