గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, ఏప్రిల్ 2014, ఆదివారం

సుపుత్రః కులదీపకః. మేలిమి బంగారం మన సంస్కృతి 182.

జైశ్రీరామ్.
శ్లో. ప్రదోషే దీపకశ్చంద్రః ,ప్రభాతే దీపకో రవిః
త్రైలోక్యే దీపకో ధర్మః ,  సుపుత్రః కులదీపకః.
గీ. రాత్రి వేళను దీప్తి రేరాజొసంగు.
పగలు వెల్గునొసంగును భాస్కరుండు.
ధర్మ దీప్తి ముల్లోకాలఁ దనరఁ జేయు.
కులమునకు దీప్తిసత్పుత్రకుఁడు నిజంబు. 
భావము. చీకటి వేళ చంద్రుడు దీప్తినిస్తాడు. ఉదయాన్ని సూర్యుడు ప్రకాశవంతం చేస్తాడు. మూడు లోకాలనూ ధర్మమే ప్రకాశింపజేస్తుంది. కులాన్ని సుపుత్రుడు ప్రకాశింపజేస్తాడు.
జైహింద్.


Print this post

3 comments:

Vinjamuri Venkata Apparao చెప్పారు...

Chala mamchi bhaavana,,,,

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ చింతా రామ కృష్ణా రావు గురుదేవులకు పాదాభి వందనములతో ...

నిత్యమూ మంచి మంచి విషయములు తెలియ జేయు చున్న మీకు ధన్యవాదములు

ప్రతీ యొక్కరు ధర్మమును కాపాడు సుపుత్రుని కొరకు భగవంతుని ప్రార్థించ వలెను.

శిష్య పరమాణువు
వరప్రసాదు .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును నిజమైన మిజాన్ని చెప్పారు .అందుకేగా మునులు చెడ్డ వారైన నూరుమంది పుత్రుల కంటె ఒక్క సుపుత్రుడు చాలని కోరుకుంటారు మంచి సూక్తి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.