జైశ్రీరామ్.
శ్లో. అలసస్య కుతో విద్యా ? అవిద్యస్య కుతో ధనం ?
అధనస్య కుతో మిత్రం ? అమిత్రస్య కుతస్సుఖమ్ ?
గీ. బద్ధకిష్టులు విద్యలఁ బడయునెట్లు?
విద్యలేకున్న ధనలక్ష్మి వెలయునెట్లు?
ధనము లేకున్నమిత్రాళి దరియునెట్లు?
మిత్రహీనుండు సుఖముగ మెలగునెట్లు?
భావము. బద్ధకము కలవానికి విద్య ఎక్కడిది ? విద్య లేని వానికి ధనం ఎక్కడిది ? ధనం లేని వానికి మిత్రుడెక్కడ ? మిత్రుడు లేని వానికిసుఖమెక్కడ ?
జైహింద్
2 comments:
శ్రీ చింతా రామ కృష్ణా రావు గురుదేవులకు పాదాభి వందనములతో ...
గురువుగారు నేడు విద్యార్థులు బహు సుకుమారులు, బద్ధకస్తు లైనారు. అందు వలన నేడు ఉపాద్యాయుల పని కత్తమీద సామువలెనున్నది.
నేటి విద్యార్థులకు విద్య లేదు,కానీ తల్లి దండ్రులు సంపాదించిన ధనము మాత్రము యున్నది. పేసు బుక్కులో పాడు మిత్రుల వల్ల సుఖము మాత్రము సున్నా
మంచి విషయములు తెలియ జేయు చున్న మీకు ధన్యవాదములు .
శిష్య పరమాణువు
వరప్రసాదు .
నమస్కారములు
నిజానికి " బద్ధకమో పరమ దరిద్రమొ " అన్నారు పెద్దలు ఇక ఆ బద్ధక్మ్ స్టుకి ఎన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఏదీ సాధించ లేడు . మంచి సూక్తి ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.